అలుపెరగని కమ్యూనిస్టు ఎర్ర సూరీడాయన…
1 min read
నిబద్ధత గల నిజమైన కమ్యూనిస్టు నాయకులు పుప్పాల దొడ్డి బండమీద వెంకటేశ్వర్లు
23.04.2025 న 41వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం
పత్తికొండ, న్యూస్ నేడు: నిబద్ధత గల నిజమైన కమ్యూనిస్టు నాయకులు పుప్పాల దొడ్డి బండమీద వెంకటేశ్వర్లు అని స్థానిక ప్రజల విశ్వాసం. కమ్యూనిస్టు విలువలకూ, త్యాగానికి, ఆదర్శాలకూ, నిలువెత్తు నిదర్శనం వెంకటేశ్వర్లు అని చెప్పొచ్చు. ఆయన విప్లవ రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. పేద ప్రజలే ఊపిరిగా శ్వాసించి, జీవితమంతా పీడిత ప్రజల విముక్తి కోసమే పరితపించి జనం మదిలో చేస్తాయిగా నిలిచిపోయారు. పేదల కష్టాల్లో పాలుపంచుకొనే ధ్రువతరాగా నిలిచి వెలిగారు. తన జీవన గమనంలో జనమే తప్ప వ్యక్తిగతం లేని అలుపెరగని కమ్యూనిస్టు ఎర్ర సూరీడాయన. భూస్వాములు, పెత్తందార్లకు సింహస్వప్నం. పేద ప్రజల గుండెల్లో ఓ నమ్మకం తమకు కష్టం వస్తే వెంకటేశ్వర్లు ఉన్నాడనే ఓ ధైర్యం. ఉమ్మడి కర్నూలు జిల్లా లోని పూర్వపు పత్తికొండ తాలూకా పూర్వపు కారుమంచి షిర్క( ప్రస్తుతం ఆస్పరి మండలం, ఆలూరు నియోజకవర్గం). పుప్పాలదొడ్డి గ్రామంలో పక్కిరప్ప, నాగమ్మ దంపతులకు జన్మించారు.ఆయన 5 వ తరగతి వరకు వారి అమ్మ గ్రామమైన అలారుదీన్నే లో, 6 ,7 తరగతులు మండల కేంద్రమైన దేవనకొండ లో చదువుకున్నారు.పుప్పాలదొడ్డి ఓ చిన్న గ్రామం. కైరుప్పల,పుప్పాల దొడ్డి,చెన్నంపల్లి గ్రామాలు కలసి కైరుప్పల గ్రామ పంచాయతీ. కైరుప్పల చాల పెద్దగ్రామం.ఆ గ్రామంలో రెడ్డి, కరణములు ఆధిపత్యం ఉండేది.ఆ గ్రామంలో సొంత భూమి లేని అధికులు పేదలు వేలాది ఎకరాలపై హక్కు ఉన్న భూస్వాముల పెత్తందారుల . వర్షం వస్తే ఆ మూడు గ్రామాల్లో ని రైతులు,కూలీలు భూస్వాములు,పెత్తందార్లు పొలాలు లో మొదట విత్తనం వేయాలి. మాపొలాల్లో విత్తనం వేసుకోవాలి పదును పోతుంది అని రైతులు,కూలీలు తమగోడు వెళ్లబోసుకున్న అలా కుదరదని తమ పొలాల్లో.