అధికారిక కుర్చీలో… అనధికార వ్యక్తి
1 min read
మహానంది, న్యూస్ నేడు: అధికారిక కుర్చీలో ఒక అనధికారిక వ్యక్తి కూర్చోడం సోమవారం చర్చనీయాంశంగా మారింది. మహానంది మండల తాసిల్దార్ కార్యాలయంలోని వీఆర్వోల చాంబర్ నందు ఒక అనధికారిక వ్యక్తి వీఆర్వోలు కూర్చునే స్థానంలో కూర్చోవడం ఒక విశేషం అయితే, ఒక విఆర్ఓ నిలబడగా మరో విఆర్వో ప్లాస్టిక్ కుర్చీ వేసుకుని కూర్చోడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ అనధికారిక వ్యక్తి వీఆర్వోల స్థానంలో కూర్చుని వారికి సూచనలు సలహాలు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది . ఇంతకు అక్కడ అధికారులు ఎవరూ అనధికారులు ఎవరు.