టిడిపి కార్యకర్త పాడే మోసిన జనహృదయనేత బి.వీభద్రగౌడ్
1 min read
న్యూస్ నేడు ఆలూరు : ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి .శ్రీ.వీరభద్ర గౌడ్ .జిల్లా టిడిపి తెలుగు యువత అధికార ప్రతినిధి ఆలూరు వాల్మీకి సురేంద్ర అంతిమ సంస్కార కార్యక్రమంలో పాల్గొని ఆయన పాడే మోయటం జరిగింది.సురేంద్ర నిన్నటి రోజున ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో తీవ్ర అస్వస్థకు గురై ఆలూరు ప్రభుత్వ హాస్పిటల్ చికిత్స పొందుతూ ఆయన అకాలమరణం చెందిన విషయం తెలిసిందే…కావున .శ్రీ.వీరభద్ర …ఆలూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ .గుమ్మనూరు నారాయణ ,.రఘుప్రసాద్ రెడ్డి ,యువనాయకులు గౌ.గిరిమల్లేశ్ గౌడ్ అలాగే ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలతో పాటు కలసి సురేంద్ర పాడే మోసి నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తలపై ఆయన ప్రేమాభిమానాన్ని తెలియజేశారు.ఇద్దరు ముఖ్య నాయకులు ఒక కార్యకర్త పాడేమోయడం ఆలూరు రాజకీయ చరిత్రలో ఇది ప్రథమం..ఒక అద్భుతం.అలాగే సురేంద్ర అంతిమ సంస్కారాలు ముగిసే వరకు వెంటవెళ్లి రుద్రభూమిలో జరిగే మట్టి కార్యక్రమంలో కూడా పాల్గొని సురేంద్రఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ ఆయనను టిడిపి నాయకులు, కార్యకర్తలు అమరపురికి వీడ్కోలు పలికారు.. ఈకార్యక్రమంలో తాలూకా టిడిపి వివిధ హోదాలలో ఉన్న టిడిపి జనసేన,బిజెపి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు అలాగే టిడిపి అనుబంధ సంఘాలైన తెలుగుయువత, ఐటిడిపి, టియన్ఎస్ఎఫ్, టియన్టియూసి, ఇతర అనుబంధ సంఘాల నాయకులు అందరూ పెద్దఎత్తున పాల్గొన్నారు.