సురేంద్ర మృతికి ప్రఘాడ సంతాపం తెలిపిన జిల్లా టిడిపి అధ్యక్షులు
1 min read
న్యూస్ నేడు ఆలూరు: ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి గౌ.శ్రీ.వీరభద్ర గౌడ్ ఆధ్వర్యంలో..కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి ..జిల్లా టిడిపి తెలుగు యువత అధికార ప్రతినిధి ఆలూరు వాల్మీకి సురేంద్ర కి పార్టీవాదేహానికి ఘన నివాళులు అర్పించి ప్రఘాడ సానుభూతి తెలియజేశారు.నిన్నటి రోజున గౌ.ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో సురేంద్ర అస్వస్థకు గురై ఆలూరు ప్రభుత్వ హాస్పిటల్ చికిత్స పొందుతూ ఆయన అకాలమరణం చెందారు.కావున ఈరోజు జిల్లా అధ్యక్షుల వారు అలాగే గౌ.శ్రీ.వీరభద్ర గౌడ ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలతో పాటు కలసి సురేంద్ర స్వగృహానికి వెళ్లి వారి పార్టీవాదేహాన్ని సందర్శించి వారి కుటుంబాన్ని పరామర్శించారు.అలాగే వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షుల వారు తెలియజేయడం జరిగింది.ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గౌ.వైకుంఠం శివప్రసాద్ ,ఆలూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గౌ.గుమ్మనూరు నారాయణ ,మాజీ జడ్పిటీసీలు లు రాంభీమ్ నాయుడు ,ఏరూరు మీనాక్షి నాయుడు అలాగే తాలూకా వివిధ హోదాలలో ఉన్న టిడిపి, జనసేన,బిజేపి పార్టీల ముఖ్య నాయకులు,కార్యకర్తలు అలాగే టిడిపి అనుబంధ సంఘాలైన తెలుగుయువత,ఐటిడిపి, టయన్ఎస్ఎఫ్, టియన్టియూసి, ఇతర అనుబంధ సంఘాల నాయకులు అందరూ పెద్దఎత్హున పాల్గొన్నారు.