చలివేంద్రం ..చల్లటి మజ్జిగ,మంచినీరు పంపిణీ
1 min read
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : స్థానిక పత్తే బాధ జాస్తి హరినాథ్ బాబు బృందావన్ పార్క్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది వాకర్స్ అసోసియేషన్ వారు చల్లటి మజ్జిగ, మంచినీరు, ద్రాక్ష, ఆరంజ్, రోజుకో ఐటమ్ అందిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మామిళ్ళ రాఘవేంద్రరావు, మరక భుజంగరావు, స్టార్ డోనర్ ఐ.యం.ఆర్ మోహన్ రావు, సంఘ సభ్యులు వేసవి దృశ్య పాదచారులకు, వాహనదారులకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మజ్జిగ, మంచినీరు పంపిణీ చేస్తున్నారు. కార్యక్రమంలో కోశాధికారి మాడ మల్లికార్జునరావు, ఉపాధ్యక్షులు చెన్నం ప్రమీల కుమారి, పీవీ రంగారావు, సంయుక్త కార్యదర్శి పోతన మురళీకృష్ణ,రాపేటి మధు, జాలి వాకర్ ఉక్కుర్తి రాంబాబు, డైరెక్టర్ బొడ్డు మోహన్ తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు.