భారత ప్రధానమంత్రికి, ఏపీ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
1 min read
ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు యందు కీలక పాత్ర వహించిన పీఎం నరేంద్ర మోడీ ఏబిసిడి వర్గీకరణకు ఆర్డినెన్స్ జీవో జారీ చేసిన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబునాయుడు కి కృతజ్ఞతలు : ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఆనంద్
కౌతాళం, న్యూస్ నేడు : మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆఫీసు నందు విలేకరుల సమావేశంలో కార్యక్రమం నిర్వహించగా మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మన్య మందకృష్ణ మాదిగ ఏ పిలుపు ఇచ్చిన తూచ తప్పకుండా కార్యక్రమం నిర్వర్తించి ఎన్నోసార్లు జైలు, కోర్టులు, చుట్టూ తిరిగిన 30 సంవత్సరాలు ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాటం చేసి నిరాశ నిస్రుహ స్థితిలో ఉన్న ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి విశ్వరూప మహా సభతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీవం పోసి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ వివాదమును ముందుండి మాదిగ జాతికే న్యాయం చేసిన నరేంద్ర మోడీ రాష్ట్రము నందు మాదిగల ఆవేదనను అర్థం చేసుకొని ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్ జీవోను అమలుపరిచిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మండల అధ్యక్షుడు ఆనంద్ కృతజ్ఞతలు తెలిపారు. స్వాతంత్రం వచ్చినప్పటినుండి నేటి వరకు 15% ఎస్సీ రిజర్వేషన్ ఫలాలను ఒక్క మాల, మాదిగల కైవసం.మందకృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ పోరాటముతో 59 ఉపకులాలు పోరాటముతో నేటినుండి వారి వాట ఫలాలు అనుభవించే భాగ్యం మందకృష్ణ వల్లనే సాధ్యమైంది అని కోరారు..ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నాగరాజు, సంపత్ ,జలాల్ ,అన్నమయ్య వీరేష్ ,తదితరులు పాల్గొన్నారు.