వాట్సప్ గవర్నెన్స్ సేవలను వినియోగించుకోండి..
1 min read
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు న్యూస్ నేడు: వాట్సప్ గవర్నెన్స్ సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “ఏపీ ప్రభుత్వం వాట్సాప్ సేవలు” పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి అందచేస్తున్న వివిధ పౌర సేవలు మరింత చేరువ చేసే క్రమంలో వాట్సాప్ గవర్నెన్స్ ను “9552300009” నెంబర్ ద్వారా తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. ఏప్రిల్ నెల 15వ తేది నుండి ఇంటివద్ద నుంచే పౌరసేవలు – “మనమిత్ర” వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం అయ్యాయన్నారు.. ఈ వేదిక ద్వారా ప్రజలు ప ధృవపత్రాలు, లైసెన్సులు, పన్నుల చెల్లింపులు, బిల్లులు, దేవాలయ దర్శనాలు, పరీక్ష ఫలితాలు వంటి 250 కి పైగా సేవలను పొందవచ్చునన్నారు.. అవినీతికి తావు లేకుండా వేగంగా సేవలు అందించేందుకు ఇది మరో ప్రగతిశీల చర్యగా నేటి సుపరిపాలనలో నిలవనుందన్నారు.వాట్సాప్ మెసేజ్ మాత్రమే కాదు, వాయిస్ మెసేజ్ ద్వారా కూడా సేవలు అందే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా మెచ్చుకోదగిన విధంగా వ్యవస్థ రూపొందించబడిందన్నారు. స్మార్ట్‌ఫోన్ లేని వారి కోసం ఎస్‌ఎంఎస్ ద్వారా సేవలు పొందే అవకాశాలు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయన్నారు.. ఆర్టీజీఎస్ వ్యవస్థ ద్వారా అన్ని శాఖల డేటాను అనుసంధానిస్తూ, ప్రతి పౌరుడి సమాచారం ఆధారంగా సేవలను అందించనున్నారన్నారు. కివ్ఆర్ కోడ్ ద్వారా ధృవపత్రాల నిజనిజాలను గుర్తించే సదుపాయం కూడా ఈ వేదికలో ఉంటుందన్నారు. ప్రస్తుతం మనమిత్ర తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అందుబాటులో ఉంది. త్వరలో మరిన్ని భాషల్లో సేవలు పొందేలా చర్యలు చేపడుతున్నారన్నారు.కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. బి. నవ్య, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.