పిల్లల విద్యాభివృద్ధి పట్ల తల్లిదండ్రులు బాధ్యత గా వ్యవహరించాలి
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు : తమ పిల్లల పట్ల విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు బాధ్యతగా దోహదపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భ్రమరాంబ గుర్తు చేశారు. సోమవారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో హెడ్మాస్టర్ భ్రమరాంబ ఆధ్వర్యంలో “హో లిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ “నుపంపిణీ చేశారు. అలాగే విద్యార్థినులను ప్రస్తుతం ఉన్న తరగతులనుంచి ఉన్నత స్థాయి తరగతులకు మార్పిడి చేశారు.ఈ సందర్భంగా పాఠశాల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో భ్రమరాంబ మాట్లాడుతూ, తల్లిదండ్రులు పిల్లలను బాధ్యతతో క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని, వారి విద్యా ప్రగతిని నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు .కనీసం నెలకు ఒకసారి పాఠశాలను సందర్శించి మీ పిల్లల విద్యాభివృద్ధిని, వారి ప్రవర్తనను మా దృష్టికి తీసుకొని రావాలన్నారు. పాఠశాలలో ఏమైనా లోటుపాట్లు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు .ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను వినియోగించుకొని మీ పిల్లలను బాగా చదివించుకోవాలని ఆమె అన్నారు .ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ చైర్మన్ మీరా హుస్సేన్ ,గోపాల్ తల్లిదండ్రులు ఆడ పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియచేశారు.ఈ సమావేశంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.
