NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జూనియర్ మహిళా న్యాయవాది తుంగల మణి ప్రియకు న్యాయం జరగాలి

1 min read

విజయవాడ  , న్యూస్​ నేడు : జూనియర్ మహిళా న్యాయవాది తుంగల మనిప్రియకు న్యాయం జరగాలని ఆమె సీనియర్ న్యాయవాదులు పిట్టల శ్రీనివాసరావు, కొలుసుసౌందర్య మూకుమ్మడిగా జిల్లా కోర్టు భవన ఆవరణలో దాడి చేశారని ఆరోపణ చేశారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ   2025  ఏప్రిల్ 17వ తారీఖున తనపై సీనియర్ న్యాయవాదులు పిట్టల శ్రీనివాసరావు కొలుసు సౌందర్య ఇద్దరు కలిసి మూకుమ్మడిగా జిల్లా కోర్టు భవనం ఆవరణలో మూకుమ్మడిగా దాడికి దిగారని ఆరోపణ చేశారు పిట్టల శ్రీనివాసరావు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి దుర్భాషలాడుతూ మీ ఆయనకు కి నీకు గొడవలు జరుగుతున్న నిమిత్తం లో కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి తొందరగా మీ ఆయనకి విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకోవాల్సిందిగా పలుమార్లు ఒత్తిడి చేస్తూ వస్తున్నారని ఆరోపణ చేశారు. 17వ తేదీన కోర్టు లోంచి బయటకు వస్తుండగా తనపై తుంగల మణి ప్రియ పై చెయ్యి వేసుకుని లాగి అసభ్యకరంగా పిట్టల శ్రీనివాసరావు ప్రవర్తించారని తెలిపారుఅప్పుడు ప్రతిఘటిస్తూ ఉన్న సమయంలో సీనియర్ లాయర్ గొలుసు వసుంధర వచ్చి తప్పేముంది సీనియర్ లాయర్ కదా మీ ఆయన కి విడాకులు ఇచ్చి ఈ శ్రీనివాసరావు ని పెళ్లి చేసుకో ఒత్తిడి చేస్తూ దుర్భాషలాడి నాపై చేయి చేసుకున్నారని తుంగల మణి ప్రియ తెలిపారు. ఈ విషయమై బార్ అసోసియేషన్ లో కంప్లైంట్ ఇచ్చి కోర్టు ముందు నడిరోడ్డుపై మండుట ఎండలో సాయంత్రం 6 వరకు ధర్నా చేశానని అప్పుడు స్థానిక పోలీసులు వచ్చి స్టేషన్ కొచ్చి కంప్లైంట్ ఇవ్వండి ఎఫ్ఐఆర్ కడతామని చెప్పి నన్ను అక్కడి నుంచి తీసుకు వెళ్లారని తెలిపారు.ఈ విషయంపై నేను స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే సబ్ ఇన్స్పెక్టర్ అక్కడున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇది మీ లాయర్లు గొడవా వెళ్లి బార్ అసోసియేషన్ లో తేల్చుకోండి అన్నారని అన్నారు. బార్ అసోసియేషన్ లో కంప్లైంట్ పెడితే స్పందన కలగలేదని ఆమె అన్నారు  నాకు జరిగిన అవమానాన్ని న్యాయమూర్తులు సుమోటోగా తీసుకొని కేసులు దర్యాప్తు చేయవలసిందిగా కోరుతూ తనపై దాడి చేసే వారిని తక్షణమే బార్ అసోసియేషన్ నుంచి తొలగించి వారి లా ప్రాక్టీస్ ని రద్దు పర్వదిన దిగా డిమాండ్ చేస్తూ నాకు న్యాయం జరగాలని కోరారు . .   రాష్ట్ర హైకోర్టు ని దేశ సుప్రీంకోర్టు ని వేడుకున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *