జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
1 min read
ఫిర్యాదు దారులకు సత్వర న్యాయం చేయాలని అధికారులకు ఆదేశం
జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్
శ్రీ సత్య సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిర్యాదుదారులకు భోజన సదుపాయం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయములో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారు ప్రజల వద్ద నుండి ఫిర్యాదుల స్వీకరణ ప్రజా ఫిర్యాదుల వేదికలో ప్రతి పిర్యాదు పై సత్వర న్యాయం అనే నినాదంతో అధికారులు పరిష్కరించాలన్నారు. ఏలూరు జిల్లా పోలీస్ శాఖ నేడు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆధ్వర్యంలో అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్య చంద్ర రావు ప్రజా ఫిర్యాదుల వేదికను ఉదయం 10.30 గంటల నుండి జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలు, ఎక్కవగా కుటుంబ సమస్యలపై, సరిహద్దు సమస్యలపై, సివిల్ మ్యాటర్ లపై మరియు తల్లిదండ్రుల పట్ల నిరాదరణకు గురి చేసిన వారిపై ఫిర్యాదులను జిల్లా ఎస్పీ కి నేరుగా తెలియ చేసినారు.కె ప్రతాప్ శివ కిషోర్ స్వయంగా ఫిర్యాదిదారుల వద్ద నుండి వినతులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారునితో ఓపికగా మాట్లాడి వారి యొక్క సమస్యలను అర్థం చేసుకున్నారు.అందుకున్న ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం, జిల్లా ఎస్పీ వాటిని చట్ట ప్రకారం తక్షణమే పరిష్కరించేందుకు సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.పెండింగ్లో ఉన్న ఫిర్యాదులలో వేగవంతం చేయాలని మరియు ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ తన క్రింది సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ “ప్రజా ఫిర్యాదుల వేదికలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నరు. స్వీకరించిన ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక దృష్టి సారించి, చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చూస్తాము అని హామీ ఇచ్చరు. సైబర్ నేరాలపై అవగాహన1930 హెల్ప్ లైన్ బాధితులకు తక్షణ సహాయం అందిస్తుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు. ప్రజా ఫిర్యాదుల వేదికకు జిల్లా నలుమూలల నుంచి హాజరైన ప్రజల కు ఏలూరు శ్రీ సత్యసాయి ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో అర్జీదారులకు భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు.
