‘కార్డియాలజి’ లో కర్నూలు మెడికల్ కాలేజి విద్యార్థి ప్రతిభ
1 min read
రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన డా.మహేష్ పునుపాటి
- అభినందించిన కాలేజి ప్రిన్సిపల్ డా. చిట్టి నర్సమ్మ, ప్రొఫెసర్ డా. చంద్ర శేఖర్
కర్నూలు, న్యూస్ నేడు:ఎన్టీ ఆర్ హెల్త్ యూనివర్శిటీ నిర్వహించిన మెడికల్ సూపర్ స్పెషాలిటీ ఫైనలియర్ పరీక్షల్లో కర్నూల్ మెడికల్ కాలేజీ విద్యార్థి డా. పునుగుపాటి మహేష్ కార్డియాలజీ విభాగం లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించి కర్నూలు మెడికల్ కాలేజి ప్రతిష్టను మరింత పెంచారు. కార్డియాలజీ విభాగంలో సూపర్ స్పెషాలిటీ ప్రారంభమైనప్పుడు నుండి ప్రతి సంవత్సరం స్టేట్ ర్యాంకులు సాధిస్తున్నారని ఈ సంవత్సరం స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం పట్ల అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినర్సమ్మ కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ డా . మహేష్ కు అభినందనలు తెలిపారు.