PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అల్లూరి ఒక పోరాట స్ఫూర్తి..జిల్లా కలెక్టర్

1 min read

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కు ఘన నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : అల్లూరి సీతారామరాజు ఒక పోరాట స్ఫూర్తి అని, వారి ధైర్య సాహసాలు యువతకు ఆదర్శనీయం అని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కొనియాడారు. గురువారం అల్లూరి సీతారామరాజు గారి 126 వ జయంతి సందర్బంగా  కలెక్టరేట్   కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో  అల్లూరి సీతారామరాజు గారి చిత్రపటానికి జిల్లా కలెక్టర్  పూలమాలవేసి  ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భగా జిల్లా  కలెక్టర్  మాట్లాడుతూ… భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు  ఒక మహోజ్వల శక్తి అని.. ఆయన జరిపిన పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమన్నారు.  స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని చాటుకున్న విప్లవ వీరుడన్నారు.  మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత కలిగి ఉండాలన్నారు.. అల్లూరి సీతారామరాజు ను ఆదర్శంగా తీసుకొని దేశ , సమాజ సేవలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలన్నారు. అల్లూరి సీతారామరాజు చరిత్రను విద్యార్థులు అంతా తప్పకుండా తెలుసుకోవాలని , అల్లూరి స్ఫూర్తి ని ఆదర్శంగా తీసుకుని నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవాలని కోరారు.. అల్లూరి సీతారామరాజు 1897 సంవత్సరం లో జన్మించి కేవలం 27 ఏళ్లు మాత్రమే జీవించి సమాజం కోసం ప్రాణాలు అర్పించారని తెలిపారు. ఆయన మరణించి 100 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ స్మరించుకుంటున్నామని, దేశం కోసం, అడవి బిడ్డల సంక్షేమం కోసం పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అన్నారు. అప్పట్లో బ్రిటిష్ వారు  మన్యంలో ఉన్న గిరిజనులను ఎన్నో ఇబ్బందులకు గురిచేసేవారని, అడవి లో ఉండే ఉత్పత్తులు సేకరించి అమ్ముకునే వారిపై దమనకాండ చేస్తుండగా బ్రిటిష్ వారిపై వివిధ రకాలుగా పోరాడి వారికి విముక్తి కల్పించిన వ్యక్తి అల్లూరి అన్నారు. ఆయన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశ యువత ముందుకు సాగాలని  కలెక్టర్ అన్నారు.  ఉద్యోగపర్వంలో ఏజెన్సీ ప్రాంతంలో సేవ చేసే సౌభాగ్యం తనకు కలిగిందని కలెక్టర్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య , జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన రావు , జిల్లా గిరిజన మరియు సాంఘిక సంక్షేమ అధికారి రంగలక్ష్మి దేవి , డి.పి.ఓ. నాగరాజు నాయుడు , కర్నూలు ఆర్.డి.ఒ శేషి రెడ్డి ,జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు… ఎరుకల రాజు , రవి శాస్త్రి , శాంత కుమార్ , శామ్యూల్ , ప్రభుదాస్ , రమేష్ బాబు , నవీన్ కుమార్ , సాయి ప్రదీప్ మరియు లంబాడా , గిరిజన , సుగాలి నాయకులు…ఎరుకల రాజు , చంద్రప్ప , మద్దిలేటి , యోగేష్ నాయక్ , గుండాల నాయక్ , రాముడు నాయక్ , శ్రీను నాయక్ , కృష్ణ , ఉద్యోగ సంఘ నాయకులు మద్దిలేటి తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

About Author