పోలవరం ప్రాజెక్ట్ లో నాణ్యత ను పరీక్షించిన కేంద్ర బృందం
1 min read
రెండు బృందాలు నాణ్యతా పరీక్షలు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగించే కాంక్రీట్,రాళ్ళ నాణ్యతనుకేంద్ర బృందాలు పరిశీలిస్తున్నాయి. సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సి ఎస్ ఆర్ ఎం ఎస్ )కు చెందిన రెండు బృందాలు ఈ నాణ్యత పరీక్షల్లో పాల్గొంటున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ లో వినియోగించే కాంక్రీట్, ఆ కాంక్రీట్ మిక్స్ చేసేందుకు వినియోగించే వివిధ సైజుల రాళ్లను ఈ బృందాలు మంగళవారం తనిఖీ చేశాయి. బట్రస్ డ్యామ్, డి వాల్ నిర్మాణ ప్రాంతం, 902 హిల్ ప్రాంతం మొదలైన వాటిని వీరు పరిశీలించారు.ప్రాజెక్ట్ నిర్మాణం లో వినియోగించే కాంక్రీట్, అందులో కలిపే వివిధ రకాల మెటీరియల్స్ ను నిపుణులు రవి అగర్వాల్, లలిత్ కుమార్ సోలంకి, రాళ్ళను సందీప్ దనోటే పరిశీలించారు. కేంద్ర బృందం వెంట జలవనరుల శాఖ అధికారులు డీ శ్రీనివాస్, ఎం. శ్రీరాం పటేల్, ఆర్ దుర్గాప్రసాద్,ఆర్ వీ చిరంజీవి,వీ జగదీష్, జి సురేంద్ర, జాన్ కరణ్ ఉన్నారు, ఎం ఈ ఐ ఎల్ జి ఎం గంగాధర్,డి జీ ఎం మురళి పమ్మి వీరి తనిఖీలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.