విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా జూటూరు రవి నియామకం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా కర్నూలుకు చెందిన జూటూరు రవి నియమితులయ్యారు. తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగమైన తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనకు ఈ కమిటీలో సభ్యునిగా చోటు దక్కింది. ఈ మేరకు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కొత్త కమిటీని ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ మరియు కమిటీ ఛైర్మన్ పి.రంజిత్ బాషా ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త కమిటీ రెండేళ్ల పాటు ఉంటుంది. కమిటీలో స్థానం దక్కించుకున్న జూటూరు రవి మాట్లాడుతూ తనపై పెట్టిన నమ్మకాన్ని వొమ్ము చేయకుండా పనిచేస్తానని పేర్కొన్నారు. తనను అన్నివిధాలుగా ప్రోత్సహించిన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్‌కు.. ఆయన కృతజ్నతలు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటానని చెప్పారు.