NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీలో 6500 పోలీసు ఉద్యోగాల భ‌ర్తీ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : వ‌చ్చే జాబ్ క్యాలెండ‌ర్లో సంవ‌త్సరానికి 6500 చొప్పున‌ పోలీసు ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌నున్నట్టు ఏపీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ తెలిపారు. నిరుద్యోగ అభ్యర్థులు ఓపిక‌తో ఉండాలని సూచించారు. ప్రస్తుత‌మున్న, భవిష్యత్తులో ఏర్పడ‌బోయే ఖాళీల‌ను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని తెలిపారు. గ్రామ‌,వార్డు స‌చివాలయాల్లోని 15000 మంది మ‌హిళా సంర‌క్షణ కార్యద‌ర్శుల‌ను పోలీసు శాఖ‌లో విలీనం చేసుకున్నామ‌ని తెలిపారు. వీరికి అత్యవ‌స‌రంగా శిక్షణ ఇవ్వటం తొలి ప్రాధాన్యం కావ‌డం కార‌ణంగా ఈ విడ‌త‌లో భ‌ర్తీ చేయాల్సిన 6500 ఉద్యోగాల భ‌ర్తీ తాత్కాలికంగా వాయిదా ప‌డింద‌న్నారు. ఒక విడ‌త‌లో గ‌రిష్ఠంగా 6500 మందికే శిక్షణ ఇవ్వగ‌ల‌మ‌ని తెలిపారు. మ‌హిళా పోలీసుల‌కు శిక్షణ ఇవ్వడానికి కొన్నినెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు.

About Author