NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ..

1 min read

రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్

అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ లు ఇవ్వాలి :- ఏపీయూడబ్ల్యూజె రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు

నంద్యాల , న్యూస్​ నేడు:  జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ఏపీయూడబ్ల్యూజె జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీ రామకృష్ణ పిజి కాలేజీ ఆడిటోరియం నందు మంత్రి ఫరూక్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజె రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలను వివరించారు. మంత్రి ఫరూక్ జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు. జర్నలిస్టులు పేదవారని, వారికి ఇంటి స్థలాలతో పాటు అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇచ్చేందుకు, జర్నలిస్టులకు ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, హెల్త్ కార్డులను మంజూరు చేయాలని కోరారు. అనంతరం మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని, నంద్యాలలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలతోపాటు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసేందుకు తగిన స్థలాన్ని కేటాయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఏపీయుడబ్ల్యూజె రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్యాం సుందర్ లాల్ మాట్లాడుతూ నంద్యాల జర్నలిస్టులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు స్థలం ఇవ్వాలని మంత్రి ఫరూక్ ను కోరారు. స్థలం కేటాయిస్తే తన వంతుగా ప్రెస్ క్లబ్ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల విరాళాన్ని ఆయన ప్రకటించారు. అనంతరం మంత్రి ఫరూక్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మధుబాబు, ఉస్మాన్ భాష, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చలంబాబు, సీనియర్ పాత్రికేయులు జనార్దన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి,ఏపీయూడబ్ల్యుజే కర్నూలు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, శ్రీనివాస గౌడ్, ఐజెయు నాయకులు నాగరాజు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజశేఖర్, మద్దిలేటి, పాత్రికేయులు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా జిల్లా కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతనంగా ఎంపికైన రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్యాంసుందర్ లాల్, వాసు, నాగేంద్ర, సుబ్బయ్య లను రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు సన్మానించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *