పదవ తరగతి ఫలితాలలో రవీంద్ర ప్రభంజనం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు : నేడు ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో స్థానిక అబ్బాస్ నగర్ లోని రవీంద్ర పాఠశాలల విజయ ప్రభంజనం కొనసాగించింది.మొత్తం 600 మార్కులకు జి ధరణి(594),ఏ. తేజస్వి (594)మార్కులతో ప్రథమస్థానం పొందగా…., యస్.కీర్తన(592),…. కె. పవన్ కుమార్ ఆచారి(591)….. మీనాక్షి బాయ్(590), యశ్విత చౌదరి(590), శివ సాయి కేశవ (590)అనే విద్యార్థులు ఉత్తమ మార్కులు పొందారు 550 కి పైగా 77 మంది,500 మార్కులకుపైగా 127 మంది 450 కి పైగా 161 విద్యార్థులు మార్కులు సాధించారు.ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో రవీంద్ర విద్యాసంస్థల వ్యవస్థాపకులు జి. పుల్లయ్య , చైర్మన్ జి.వి.యం.మోహన్ కుమార్ , అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ మమతా మోహన్ , వైస్ చైర్మన్ జి వంశీధర్ పాల్గొన్నారు .ఈ సందర్భంగా రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు జి పుల్లయ్య మాట్లాడుతూ పదవ తరగతి ప్రతి విద్యార్థి జీవితంలో మొదటి మెట్టు అని అందుకు తగిన కృషిచేసి ఉత్తమ ఫలితాలు సాధించిన మిమ్ములను చూస్తూ ఉంటే నాకెంతో గర్వంగా ఉందన్నారు. ఇష్టంతో కూడిన కష్టం మనకు మంచి దారి చూపుతోందన్నారు చైర్మన్ జి.వి.యం. మోహన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి దృఢ సంకల్పంతో కష్టపడి చదివితే మార్కులు సాధించడం గొప్పేమీ కాదన్నారు. ప్రణాళికా బద్ధంగా నిర్లక్ష్యం చేయకుండా చదివితే ప్రతిదీ మనకు సాధ్యమే అన్నారు .భవిష్యత్తు ఎంతో ఆహ్లాదంగా ఉండాలంటే నేడు మనకు కష్టం తప్పదని,మెదడును నిరంతరం పరుగులు పెట్టించాలన్నారు. అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ మమతా మోహన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరము రవీంద్ర విద్యార్థులు ఒక కొత్త చరిత్రను తిరగరాస్తూ తమకు తామే పోటీగా నిలుస్తున్నామన్నారు. ఇంత అద్భుతమైన మార్కులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, అందుకు కృషిచేసిన ఉపాధ్యాయులను రవీంద్ర విద్యాసంస్థల వ్యవస్థాపకులు జి. పుల్లయ్య, చైర్మన్ జి.వి.యం. మోహన్ కుమార్ , అకాడమిక్ అడ్వైజర్ డా. మమతా మోహన్ వైస్ చైర్మన్ జి వంశీధర్ లు అభినందించారు.