క్రీడాభారతి ద్వారా క్రీడాకారులను తీర్చిదిద్దుతాం
1 min readపల్లెవెలుగు వెబ్ వెలుగోడు : క్రీడాభారతి సంస్థ ద్వారా గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను తీసుకొని తగిన శిక్షణ ఇచ్చి ఒలింపిక్స్ స్థాయి క్రీడాకారులు గా తీర్చి దిద్దుతామని సహాయ కార్యదర్శి దొంతా జ్యోత్స్నా అన్నారు. ఆమె శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేస్తూ వెలుగోడు పట్టణం నుంచి క్రీడాభారతి సంస్థలో నాకు అవకాశం కల్పించినందుకు శాంతినికేతన్ అధినేత సుధాకర్ , రామకృష్ణా విద్యాసంస్థల అధినేత రామకృష్ణా రెడ్డికి జిల్లా జనరల్ సెక్రటరీ నిమ్మకాయల సుధాకర్ కు జ్యోత్స్నా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెలలో మొక్కలు నాటే కార్యక్రమం ఫుట్బాల్ టోర్నమెంటును నిర్వహిస్తామని అన్నారు. ఈనెల 18 ,19 తేదీలలో రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు క్రీడాభారతి మరియు చెస్ అసోసియేషన్ సంయుక్తంగా రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించే విధంగాను మరియు ఈనెల 27 , 28 తేదీలలో రాష్ట్రస్థాయి జంప్ రోప్ పోటీలను సంయుక్తంగా నిర్వహించాలని నంద్యాల లో జరిగిన సమావేశంలో తీర్మానం చేసినట్లు చెప్పారు.