NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ వైఎస్ను తిడుతుంటే… గాజులు తొడుక్కున్నారా’ ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : తెలంగాణ మంత్రులు దివంగ‌త ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖర‌రెడ్డిని నోటికొచ్చిన‌ట్టు తిడుతుంటే.. ఏపీ సీఎం జ‌గ‌న్ నోరు విప్పలేని ప‌రిస్థితిలో ఉన్నారా ? అంటూ తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మన్ జేసీ ప్రభాక‌ర‌రెడ్డి ప్రశ్నించారు. అనంత‌పురం జిల్లా పెద్దవ‌డుగూరులో ఆయ‌న తెలుగుదేశం స‌ర్పంచ్ ల‌తో ఆత్మీయ స‌మావేశం నిర్వహించారు. సెటిల‌ర్స్ ను బూచిగా చూపించి.. జ‌గ‌న్ త‌న చేత‌గానితనాన్ని క‌ప్పిపుచ్చుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. ఏపీకి జ‌రుగుతున్న అన్యాయంపై గ‌ట్టిగా మాట్లాడ‌క‌పోతే ఎవ‌రు లెక్కచేస్తార‌ని అన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు గాజులు తొడుకున్నారా ? అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

About Author