గుండె రక్తనాళాల్లో పూడికలకు అత్యాధునిక చికిత్స
1 min readఇంట్రావాస్క్యులర్ అల్ట్రాసౌండ్ సాయంతో స్టెంట్ అమరిక
పల్లెవెలుగు వెబ్ అనంతపురం: గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడితే స్టెంట్ వేయడానికి ఇప్పటివరకు వేర్వేరు పద్ధతులున్నాయి. కానీ, అత్యాధునిక టెక్నాలజీ అయిన హై డెఫినీషన్ ఇంట్రా వాస్క్యులర్ అల్ట్రాసౌండ్ సాయంతో స్టెంట్ వేసి 50 ఏళ్ల మహిళ ప్రాణాలను కిమ్స్ సవీరా వైద్యులు కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ మూడే సందీప్ తెలిపారు. “కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన ఓ మహిళ గుండె నొప్పితో ఆస్పత్రికి వచ్చారు. ఆమెకు యాంజియోగ్రామ్ చేసి చూడగా.. గుండె రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్లు తెలిసింది. అత్యాధునిక టెక్నాలజీ అయిన హై డెఫినీషన్ ఇంట్రా వాస్క్యులర్ అల్ట్రాసౌండ్ (హెచ్‌డీ ఐవీయూఎస్) సాయంతో ఆమెకు ఎడమ ప్రధాన విభజన స్టెంట్ అమర్చాము. ఐవీయూఎస్ ఆధారిత యాంజియోప్లాస్టీ అనేది ఒక మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్. రక్తనాళాల్లో పూడికలను గుర్తించి, చికిత్స చేసేందుకు ఇది ఉపయోగిస్తారు. ఇంట్రావాస్క్యులర్ అల్ట్రాసౌండ్ ఇమేజింగ్‌ను, యాంజియోప్లాస్టీ టెక్నిక్‌లను మేళవించి.. రక్తనాళాల పరిస్థితి తెలుసుకుని, వాటికి తగిన చికిత్స చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ రంగంలో ఐవీయూఎస్ యాంజియోప్లాస్టీ అనేది ఎంతో విలువైన చికిత్సగా రుజువైంది. దీనివల్ల రక్తనాళాలు, వాటి గోడల పరిస్థితి పూర్తిగా తెలిసి, కచ్చితమైన చికిత్సా విధానాలను అమలుచేయడానికి వీలవుతుంది. దీని ద్వారా రోగికి కచ్చితమైన నిర్ధారణకు రాగలుగుతారు. ఏర్పడిన బ్లాక్ లు తెలుసుకోవడం, స్టెంట్ ఏ సైజులో వేయాలి, స్టెంట్ వేసిన తర్వాత సరిగా ఉందో లేదో అనే విషయాన్ని ఈ టెక్నాలజీ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే రోగికి స్టెంట్ పరిమాణం తగ్గడం వల్ల రోగికి లాభం చేకూరుతుంది.
ఐవీయూఎస్ స్టెంటింగ్ వల్ల ప్రయోజనాలు ఇవీ..
రక్తనాళాల గోడలపై కచ్చితమైన అంచనా ఐవీయూఎస్ వల్ల వస్తుంది. దానివల్ల ప్రతి ఒక్కరోగికీ కావల్సిన ప్రత్యేక చికిత్సా పద్ధతులను నిర్ణయించుకోవచ్చు. యాంజియోప్లాస్టీ సాధారణంగా గుండె రక్తనాళాల 2డి ఇమేజ్ ఇస్తుంది. ఐవీయూఎస్‌లో దానికి 3డి ఇమేజ్ వస్తుంది. స్టెంటింగ్ లేదా ఎథెరెక్టమీ లాంటి అదనపు చికిత్సలు ఏమైనా అవసరమా అన్న విషయాన్ని ఐవీయూఎస్ ద్వారా ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు నిర్ణయించగలరు. 4. రక్తనాళాల గోడలను చూపడం ద్వారా సాధారణ యాంజియోగ్రఫీ తర్వాత ఎదురయ్యే కొన్ని ముప్పులను తగ్గించుకోవచ్చు.
ఐవీయూఎస్ ఆధారిత స్టెంటింగ్, ఓసీటీ గైడెడ్ స్టెంటింగ్, రోటాబ్లేషన్ లాంటి అత్యాధునిక చికిత్సలన్నీ ఇప్పుడు అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయి” అని డాక్టర్ మూడే సందీప్ వివరించారు. 50 ఏళ్ల మహిళకు సమయానికి అందించిన అత్యాధునిక చికిత్సతో ఆమె పూర్తిగా కోలుకున్న నేపథ్యంలో రోగి, ఆమె బంధువులు డాక్టర్ మూడే సందీప్‌కు, కిమ్స్ సవీరా ఆస్పత్రిలోని ఆయన బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.