శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
1 min read
శ్రీవారికి 108 కలశముల చెరుకు రసాలతో అభిషేకాలు
అధిక సంఖ్యలో భక్తులు అభిషేకాలను తిలకించారు
పశ్చిమగోదావరి జిల్లాప్రతినిధి న్యూస్ నేడు : శ్రీవెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి అష్టోత్తర శతకలస ఇక్షురసాభిషేకం (108 కలశముల చెరుకు రసాలతో అభిషేకాలు) నిర్వహించారు. బుధవారం భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీపద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. చల్లగండ్ల సత్యనారాయణ, సుజాత దంపతులు, చల్లగండ్ల రాహుల్ సాయి, సాయి లాస్య దంపతులచే శ్రీవారికి అష్టోత్తర శతకలస ఇక్షురసాభిషేకం (108 కలశముల చెరుకు రసాలతో అభిషేకాలు) నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అభిషేకాలను తిలకించి స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో మందిర కార్యదర్శి కుక్కల బాల, సరిపడకల రామారావు, జానపాటి మధు, పెన్నడ శ్రీను, కడలి వెంకటేశ్వరరావు, అల్లు రామారావు, కడలి ఫణి కుమార్, అల్లం రమేష్, నళిని మోహన్, ఏడిద త్రిమూర్తులు, పద్మావతి మహిళా పారాయణం బృందం పాల్గొన్నారు.