PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీజన్ వ్యాధుల పట్ల- అప్రమత్తంగా ఉండాలి

1 min read

పరి సరాలను -పరిశుభ్రంగా ఉంచుకోవాలి…జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగరాజు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు :  సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తమ పరిసరాలలో ఎక్కడ కూడా వర్షపు నీరు నిలువ ఉండకుండా చూడాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగరాజు అన్నారు, సీజన్ వ్యాధులైన, డయేరియా, డెంగ్యూ, మలేరియా, మెదడు వాపు వ్యాధి, అతిసారా వ్యాధుల గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి శుక్రవారం ఫ్రైడే ఫ్రైడే గురించి చెన్నూరులో ర్యాలీ నిర్వహించారు, అనంతరం చెన్నూరు లోని అరుంధతి నగర్ నందు అక్కడి ప్రజలకు అవగాహన కల్పించారు, ఈ సందర్భంగా ఆయన అరుంధతి నగర్   వాసులతోమాట్లాడుతూ, గ్రామంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు, ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంటూ, తమ పరిసరాలను కూడా  పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు, అలాగే భోజనానికి ముందు, మలమూత్ర విసర్జన తరువాత చేతులు శుభ్రపరచుకోవాలని తెలిపారు, అదేవిధంగా గ్రామ సమీపంలోని గ్రామాల మధ్య, ఇండ్ల వద్ద ఉన్న రోడ్లలో వర్షపు నీరు నిలువ ఉండకుండా చూడాలన్నారు, అలాగే ప్రతి “ఫ్రైడే డ్రై డే “గురించి వివరించారు, సీజన్లో వచ్చే డయేరియా, డెంగ్యూ, మలేరియా, బోదకాలు, అది సారా, మెదడువాపు వ్యాధి, వంటి వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, వీటి గురించి అవగాహన కలిగి తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు, ఐదు సంవత్సరాల లోపు పిల్లలు డయేరియా బారిన పడకుండా అతిసార నుండి రక్షించుకోవడానికి ఓ ఆర్ ఎస్, జింకు మాత్రలు వాడాలని అక్కడ ప్రజలకు తెలియజేశారు, ఏమాత్రం ఆరోగ్యం బాగా లేదన్న సూచనలు కనబడిన వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, లేదా సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకోవాలని తెలిపారు, ఈ కార్యక్రమంలో డి ఎం ఓ మనోరమ, పీహెచ్సీ వైద్య అధికారి డాక్టర్ బి చెన్నారెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, ఏ ఎం ఓ వెంకటరెడ్డి, మురళి, బాల పుల్లయ్య, శంకర్ రెడ్డి, సూపర్వైజర్ లు రిబక, లక్ష్మీదేవి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author