సోమయాజుల పల్లె విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే..
1 min read
కనీ వినీ ఎరుగని రీతిలో విగ్రహ ప్రతిష్ట..
ఓర్వకల్లు (మిడుతూరు) న్యూస్ నేడు : కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల పరిధిలోని సోమయాజుల పల్లెలో గురువారం సుంకులమ్మ గుడి విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది.ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యేకు గ్రామ నాయకులు ఘన స్వాగతం పలికారు. సుంకులమ్మ గుడి దేవాలయంలో అమ్మవారికి ఎమ్మెల్యే మరియు తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ మెంబర్ మల్లెల రాజశేఖర్ ప్రత్యేకంగా పూజలు చేశారు.తర్వాత ఎమ్మెల్యే కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఉదయం నుండి దేవాలయంలో గ్రామ ప్రజలు బంధువులు టెంకాయలు కొడుతూ ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.కనీ వినీ ఎరుగని రీతిలో బంధువులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఓరకల్లు ఎస్సై సునీల్ కుమార్ మరియు నాయకులు పాల్గొన్నారు.
