స్వల్ప నష్టంతో ముగిసిన స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్: మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ సూచీలు.. స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. నిఫ్టీ మరోసారి ఆల్ టైం హై దగ్గర్లో ట్రేడ్ అవ్వడంతో .. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు కన్సాలిడేట్ అయ్యాయి. అనంతరం జీఎస్టీ వసూళ్లు తగ్గుదల, జూన్ ద్రవ్యోల్బణం గణాంకాలపై ప్రతికూల సంకేతాలు చివర్లో మార్కెట్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఈ నేపథ్యంలో నిఫ్టీ 16 పాయింట్ల నష్టంతో 15,818 వద్ద ట్రేడింగ్ ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 313 పాయింట్ల లాభంతో 35,525 వద్ద ట్రేడింగ్ ముగించింది. నిఫ్టీ స్వల్ప నష్టంతో ట్రేడింగ్ ముగిసినప్పటికీ.. బ్యాంక్ నిఫ్టీ మాత్రం లాభాల్లోనే ట్రేడింగ్ ముగించింది. ఆటో, ఐటీ, టెక్, ఇంధన రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో నిఫ్టీ స్వల్పంగా నష్టపోయింది.