PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సెప్టెంబర్ 14,15 తేదీలలో బడేటి చాలెంజ్ కప్

1 min read

ఏపీ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి కరాటే పోటీలు

ఆత్మ రక్షణకు కరాటే ఎంతో దోహదపడుతుంది

ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : మానసిక ఒత్తిడిని జయించడంతో పాటూ ఆపత్కాలంలో ఆత్మ రక్షణకు కరాటే ఎంతగానో దోహదపడుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 14, 15, తేదీల్లో బడేటి ఛాలెంజ్ కప్ పేరుతో ఏలూరులో జాతీయస్థాయి కరాటే పోటీలు నిర్వహించనున్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి అందించనున్న విజేత కప్‌ను ఎమ్మెల్యే బడేటి చంటి ఆదివారం ఏలూరు రామకృష్ణాపురంలోని కాస్మోపాల్టెన్‌ క్లబ్‌ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు కరాటేలో నైపుణ్యం పొందాలన్నారు. విద్యార్థులను కరాటేలో ప్రోత్సహిస్తూ ఎంతోమందిని కరాటే యోధులుగా తయారు చేసి రాష్ట్ర, జాతీయస్థాయిలో పాల్గొనేలా శిక్షణ ఇస్తున్న ఇబ్రహీం బేగ్, షహన్షాలను ఆయన అభినందించారు. బడేటి పేరుతో నిర్వహిస్తున్న ఈ జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ఏలూరు విద్యార్ధులు కప్‌ను సొంతం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఇండియా చీఫ్ కొచ్ ఇబ్రహీం బేగ్ మాట్లాడుతూ 15వ జాతీయ స్థాయి కరాటే పోటీలు ఏలూరులోని సర్‌ సీఆర్‌ఆర్‌ ఇంజినీరింగ్ కాలేజ్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 15 రాష్ట్రాల నుండి క్రీడాకారులు పాల్గొంటారన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి, యూనివర్సిటీ స్థాయి పోటీల్లో తాము శిక్షణ ఇచ్చిన విద్యార్ధులు ఎన్నో బంగారు పతకాలు సొంతం చేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో షహన్షా, నల్ల బాబు, నాగం శివ, కౌలూరి చంద్రశేఖర్, ఈతకోట శ్రీనివాసరావు, బెల్లపుకొండ కిషోర్. అమరావతి అశోక్, నారాయణ, కరాటే మాస్టర్ రాధా, పలువురు ఇన్స్‌స్టక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

About Author