PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భావితరాలకు ఆదర్శం… బాబు జగ్జీవన్​ రావు

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఆదోని: అట్టడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్​ రావు అని పేర్కొన్నారు ఆదోని వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బి. దేవ. మంగళవారం బాబు జగ్జీవన్​ రావు వర్ధంతిని సందర్భంగా ఆదోని పట్టణంలో బైక్​ ర్యాలీ చేశారు. అనంతరం బాబు జగ్జీవన్​ రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బి.దేవ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధుడు…దేశ సేవకుడు బాబు జగ్జీవన్​ రావు ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. 78 ఏళ్ల జీవితంలో… 50 ఏళ్లు రాజకీయంగా కొనసాగుతూ…ప్రజా సేవకు అంకితమయ్యారని కొనియాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నర్సింలు, ఎరుకల రాముడు, భాస్కర్, ప్రభాకర్ , భీమా , ఎరుకల వెంకటేశు, ఎరుకల రమేష్, చిన్న ఈరన్న, సోప్ ఎల్లప్ప, ప్రసాదు, ఎల్లప్ప , సిద్ధ శివ, మారన్న తదితరులు పాల్గొన్నారు.

About Author