అక్షయ తృతీయ సందర్భంగా శ్రీరామచంద్రునికి గంధం తో అలంకారం…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: పవిత్ర వైశాఖ బహుళ తృతీయ ” అక్షయ తృతీయ సందర్భంగా హరిశ్చంద్ర షరీన్ నగర్ లోని శ్రీ సద్గురు త్యాగరాజ సీతారామాలయంలో… అర్చకులు మాళిగి భానుప్రకాష్ ఆధచవర్యంలో…ఉదయాన్నే శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయస్వామిల వారికి సుప్రభాతం, మహాభిషేకం, పంచామృతాభిషేకం అనంతరం…శ్రీ రామచంద్రుల వారికి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి పూజా విగ్రహాలకు గంధలేపనం తో స్వామివారికి అలంకారం, అష్టోత్తర శతనామ పూజ, మహా మంగళ హారతి, అనంతరం దద్దోజనం ( పెరుగన్నం) నైవేద్యం చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిగింది.