NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తెలంగాణ, ఏపీ మార్కెట్లలో 3X వృద్ధి సాధించిన టాటా ఏఐజీ…

1 min read

అంతగా సేవలందని మార్కెట్ల కోసం మెడికేర్ సెలెక్ట్ ఆవిష్కరణ

1600+ ఆసుపత్రులతో ప్రాంతీయంగా పటిష్టమైన నెట్వర్క్

2025 ఆర్థిక సంవత్సరంలో రెండు రాష్ట్రాల్లో 97% క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి

14,500 మంది అడ్వైజర్లు, వారి కుటుంబాలకు విస్తృత ఆదాయ అవకాశాలు

వరంగల్, న్యూస్​ నేడు :  గత ఏడాది వ్యవధిలో 82,000 పైచిలుకు పాలసీదారులకు కవరేజీని అందించడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్వ్యాప్తంగా తమ రిటైల్ హెల్త్ పోర్ట్ఫోలియోలో 3X వృద్ధి సాధించినట్లు భారత్లో అగ్రగామి జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వెల్లడించింది. జాతీయ సగటు కన్నా ఆరోగ్య బీమా విస్తృతి తక్కువగా ఉంటున్న దక్షిణాది మార్కెట్లలో విశ్వసనీయమైన బీమా సాధనాలకు పెరుగుతున్న డిమాండ్కి ఈ వృద్ధి నిదర్శనంగా నిలుస్తుంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 51 జిల్లాల్లో కంపెనీ తన కార్యకలాపాలను పటిష్టం చేసుకుంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, కరీంనగర్, నెల్లూరులో కీలక శాఖలను ఏర్పాటు చేసింది. టాటా ఏఐజీ నెట్వర్క్, 1,600 పైగా ఆసుపత్రులు, 14,500 అడ్వైజర్లతో సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య, బీమా సేవలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చి, జీవనోపాధి అవకాశాలను కూడా సృష్టిస్తోంది.వైద్య బీమా సేవల లభ్యతను మరింతగా పెంచే దిశగా కంపెనీ కొత్తగా మెడికేర్ సెలెక్ట్ పేరిట, మారుతున్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఉండే సరళతరమైన, తక్కువ వ్యయాలతో కూడుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. జాతీయ స్థాయిలో సగటున వైద్యచికిత్సల ద్రవ్యోల్బణం 13 శాతం స్థాయిలో ఉండగా, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో 16 శాతానికి పెరిగిన నేపథ్యంలో ఈ పెను సవాలును అధిగమించేందుకు, కస్టమర్లకు కీలక పరిష్కారాన్ని అందించేందుకు ఈ సాధనం తోడ్పడగలదు.నవజాత శిశువుల నుంచి సీనియర్ల వరకు, ఎటువంటి వయోపరిమితి లేకుండా అన్ని వర్గాల కస్టమర్లకు అనువైనదిగా, అందుబాటు ప్రీమియంలతో ఉండేలా మెడికేర్ సెలెక్ట్ రూపొందించబడింది. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మార్చుకోతగిన విధంగా ఇది ఉంటుంది. జీవితకాల యంగ్ ఫ్యామిలీ డిస్కౌంట్, 7.5% శాలరీ డిస్కౌంట్లాంటి ఉపయుక్తమైన ఫీచర్ల కారణంగా అన్ని రకాల ఆదాయవర్గాల వారు, జీవితంలో వివిధ దశల్లో ఉన్న వారికి ఇది అనువైనదిగా ఉంటుంది.గడిచిన మూడేళ్లుగా, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరే ఉదంతాలు అగ్రస్థానంలో ఉంటున్నాయి. ఖర్చులు 25 శాతం పెరగ్గా, సగటు ట్రీట్మెంట్ వ్యయాలు రూ. 1.6 లక్షలకు చేరాయి.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *