నాటు సారా పై దాడులు.. బెల్లం ఊట ధ్వంసం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: గురువారం నవోదయం కార్యక్రమంలో భాగంగా కొల్లంపల్లి తండా లో నాటు సారా పై దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడులలో సుమారు 600 లీటర్ల నాటుసారా తయారీకి పనికి వచ్చు బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగినది తదుపరి విచారణలో సదరుబట్టి కృష్ణా నాయక్ తండ్రి చంద్ర నాయకుగా తెలిసినది కావున ఇతనిపై కేసు నమోదు చేసి త్వరలో అరెస్టు చేయడం జరుగుతుంది అని తెలియజేయడం జరిగినది . ఈ దాడులలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్ ఇంటెండెంట్ (ట్రైనీ )హర్ష యశస్కర్ చంద్రహాస్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కర్నూలు, మరియు ఎన్ఫోర్స్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రవితేజ మరియు సిబ్బంది రామ చంద్ర, మధు, ఈరన్న, రాజు, గిరి తదితరులు పాల్గొన్నారు నాటు సారా తయారు చేయడం అమ్ముట నేరమని తెలియజేస్తూ నాటు సారా పూర్తిగా మానివేయాలని గ్రామస్తులను ఉద్దేశించి తెలియజేయడం జరిగింది. ఇలాగే కొనసాగితే చట్టరీత్యా చర్యలు ఉంటాయని తెలిపారు .