కార్డియాలజీ విభాగం లో నూతన బెడ్లను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
1 min read
దాత డాక్టర్ విజయ కృష్ణారెడ్డి రెడ్డిని అభినందించిన జిల్లా కలెక్టర్
కర్నూలు, న్యూస్ నేడు : కర్నూలు సర్వ జన ఆస్పత్రి కార్డియాలజీ విభాగం లో 30 నూతన బెడ్లను జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా శనివారం ప్రారంభించారు. గతంలో కార్డియాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా పనిచేసిన స్వర్గీయ డా.రామకృష్ణారెడ్డి కుమారుడు డా.విజయ కృష్ణారెడ్డి పది లక్షల రూపాయల తో కార్డియాలజీ విభాగానికి ఆధునిక సౌకర్యం గల 30 బెడ్స్ ను బహూకరించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా పేస్ మేకర్ వేయించుకున్న రోగులు, సర్జరీ లు చేయించుకున్న వారు మరియు గుండె సంబంధిత చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి పరామర్శించారు..వారికి జరిగిన ఆపరేషన్, అందుతున్న చికిత్స వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ రోగులకు అందిస్తున్న చికిత్స, అందుతున్న వైద్యసేవల వివరాలను జిల్లా కలెక్టర్ కు వివరించారు.తదుపరి కార్డియాలజీ విభాగం క్యాత్ లాబ్ లో జరుగుతున్న యాంజియోగ్రామ్ సర్జరీని జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ సర్జరీ చేస్తున్న విధానాన్ని మానిటర్లో చూపించి కలెక్టర్ కు వివరించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ, డిప్యూటీ సూపరింటెండెంట్ సీతారాములు, ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, సంబంధిత డాక్టర్లు పాల్గొన్నారు.
