నందికొట్కూర్ లో..ప్రపంచ పత్రికా దినోత్సవం
1 min read
జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేసిన మున్సిపాలిటీ కమిషనర్..
నందికొట్కూరు ,న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో శనివారం ప్రపంచ పత్రికా దినోత్సవ కార్యక్రమాన్ని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.పత్రికా స్వేచ్ఛ శక్తివంతమైన ఆయుధంగా తీర్చిదిద్దినప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని పత్రికా స్వేచ్ఛను కాపాడడం అందరి బాధ్యత అని మున్సిపల్ కమిషనర్ ఎస్ బేబీ అన్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కే. శ్రీనివాసులు,ప్రధాన కార్యదర్శి తుపాకుల రమేష్,కార్యవర్గ సభ్యులు భూపాల్,శివ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛకు పట్టం కట్టాలన్న స్ఫూర్తితో 1997 నుంచి మే 3న పత్రికా స్వేచ్ఛ అవార్డును ప్రధానం చేయడం కారణమన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ప్రసార మాధ్యమాలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల తోడుగా నిలువాలని తెలిపారు.పత్రికా స్వేచ్ఛ లోపించిన ప్రజాస్వామ్యం అసంపూర్ణమని కలం గళానికి స్వేచ్ఛ ఉన్నప్పుడే అది నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు ఉంచగలదని అన్నారు.మున్సిపల్ కమిషనర్ బేబీ,మున్సిపల్ మేనేజర్ సుహ్రులత,డీఈ నాసిర్,ఆర్వో మధుబాబు పాత్రికేయుల సమక్షంలో కేక్ కట్ చేశారు.పత్రికా విలేకరులకు పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ టోపీలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు నాగేష్,పాత్రికేయులు జయరాజ్,జలీల్, ఆంజనేయులు,స్వామన్న, సుబ్బన్న,పరమేష్,రామకృష్ణ, స్వామన్న, శేషన్న, స్వాములు, రహంతుల్లా,అబ్దుల్లా,డాలు శేషు,ఉమర్ పాల్గొన్నారు.
