NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవం

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు: అఖిలభారత యువజన సమైఖ్య ఏఐవైఎఫ్​ 66వ ఆవిర్భావ దినోత్సవం శనివారం పత్తికొండ స్థానిక సిపిఐ చదువుల రామయ్య భవనం నందు జెండా పతాక ఆవిష్కరణ తో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి  ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మాజీ నాయకులు భీమ్ లింగప్ప హాజరై ఏఐవైఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ, దేశంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే భర్తీ చేయాలని కోరారు. అదేవిధంగా తిరుపతిలో జరగబోయే జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని, యువత  పెద్ద ఎత్తున కదలి రావాలని పిలుపునిచ్చారు. ఆర్మీ రిక్రూట్మెంట్ లో ఖాళీగా ఉన్న 1,80,000 ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కారుమంచి, మాజీ వై ఎఫ్ నాయకులు పెద్ద ఈరన్న, ఏ ఐ వై ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు హనుమేష్, మండల కార్యదర్శి అల్తాఫ్, మోహన్, నజీర్, నవీన్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *