ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతికి ఘన సన్మానం..
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: రీసెర్చ్ ఆక్టివిటీకే ప్రథమ ప్రాధాన్యం.. డాక్టర్ పి. చంద్రశేఖర్, వైస్ ఛాన్స్ లర్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, విజయవాడ… వైద్యరంగంలో రీసెర్చ్ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ పి. చంద్రశేఖర్ అన్నారు. శనివారం కర్నూల్ మెడికల్ కాలేజీ సందర్శించినకి విచ్చేసిన వైస్ ఛాన్సలర్ పి.చంద్రశేఖర్ గారికి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైద్య విద్యార్థులు రీసెర్చ్ కార్యక్రమాల్లో అధికంగా కృషి చేస్తే పేద ప్రజలకు ఆ ఫలితాలు అందుతాయని అన్నారు. రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీలు,టీచింగ్ హాస్పిటల్ లో సదుపాయాల మెరుగుదలకు కృషి చేస్తానని తెలిపారు. తనకు వైద్య విద్యను అందించిన కర్నూల్ మెడికల్ కాలేజ్ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానన్నారు. కర్నూల్ మెడికల్ కాలేజీ తో పాటు రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజిలను ఒక మోడల్ కాలేజీలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ అంటే కేవలం కొన్ని అధికారిక కార్యక్రమాలకే సందర్శన కాకుండా రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీ లను మూడు నెలల్లో సందర్శిస్తానని వర్కింగ్ వైస్ ఛాన్స్ లర్ గా పని చేస్థానని, రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ ,గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు ,రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ పెద్దలు తనపై ఉంచిన నమ్మకానికి పూర్తిస్థాయిలో పనిచేసి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును జాతీయస్థాయిలో తీసుకెళ్తామన్నారు. కర్నూల్ మెడికల్ కాలేజీ విద్యార్థిగా, కార్డియాలజీ హెచ్ఓడి గా, జీ.జి.హెచ్ సూపరిండెంట్ గా, కాలేజీలో ప్రిన్సిపల్ గా పనిచేసి ఇదే కాలేజీకి వైస్ ఛాన్సలర్ గా విజిట్ కు రావడం అన్నది చాలా సంతోషాన్నిచ్చిందని తెలిపారు. అమరావతిలో వైద్య కళాశాల,హాస్పిటల్ ఏర్పాటుకు గౌరవ ముఖ్యమంత్రివర్యులను సంప్రదించడం జరిగిందని త్వరలో తదుపరి చర్యలు చేపడతామన్నారు. వైస్ ఛాన్స్ లర్ గా సమస్యల పరిష్కారానికి ఎప్పుడు తమ ద్వారాలు తెరిచే ఉంటాయని ఎవరైనా సంప్రదించ వచ్చునన్నారు.. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె. చిట్టి నరసమ్మ మాట్లాడుతూ వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ చంద్రశేఖర్ మంచి విజన్ ఉన్న వారని రాబోయే కాలానికి ఎలాంటి వసతులు ఉండాలి ఎలాంటి బోధన ఉండాలి అని ముందే గ్రహించి తధనుగుణంగా కార్యాచరణకు సిద్ధమవుతారని వారిని కొనియాడారు.. కర్నూల్ మెడికల్ కాలేజీ అభివృద్ధిలో చంద్రశేఖర్ సార్ కృషి మరువలేనిదని తెలిపారు. కేఎంసిలో 2240 మంది విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు కళాశాలలోని హాస్టల్ లో అదనపు గదుల నిర్మాణ ఆవశ్యతను గురించి కోరగా విసి స్పందించి ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారన్నారు. కొత్తగా పారామెడికల్ కోర్సులకు అప్లై చేశామని వాటికి అనుమతి ఇప్పించవలసిందిగా విసి ని కోరడం జరిగింది. ఇదే కాలేజీలో చదువుకొని ఇదే కాలేజీలో చదువుకొని ఇదే కాలేజి కి ప్రిన్సిపాల్ గా పనిచేసి ఇదే కాలేజీకి విసి హోదాలో విజిట్ కు రావడం అన్నది గొప్ప విషయమని ప్రతి వైద్య విద్యార్థి సార్ ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వైస్ ఛాన్స్ లర్ శ్రీ చంద్రశేఖర్ ని ప్రిన్సిపాల్, వివిధ విభాగాలు హెచ్వోడీలు టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనరల్ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, రీజనల్ ఐ హాస్పిటల్ సూపర్డెంట్ వెంకటేశ్వరరావు స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్, కాలేజీలోని వివిధ విభాగాల అధిపతులు అసోసియేట్, అసిస్టెంట్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.