విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం …
1 min read
కర్నూలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 111 ఫిర్యాదులు.
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు కర్నూలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో అడిషనల్ ఎస్పీ మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 111 ఫిర్యాదులు వచ్చాయి.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …
చెత్తబండి ఇప్పిస్తానని చెప్పి రూ. 3 లక్షల 30 వేలు తీసుకొని ధనుంజయ్, జానకీ రాముడులు మోసం చేశారని క్రిష్ణ గిరి మండలం, ఆలం కొండ గ్రామం కు చెందిన బంగారి ఫిర్యాదు చేశారు.
రూ. 2 లక్షల విలువ గల కంది పంటను నాశనం చేసి మా కుటుంబాన్ని మానసికంగా, ఆర్ధికంగా ఇబ్బందులకు గురి చేస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని ఓర్వకల్లు మండలం, లొద్ది పల్లె గ్రామానికి చెందిన మాల మాధమ్మ ఫిర్యాదు చేశారు. నేను ఇన్ స్టా గ్రాంలో స్టాక్ మార్కెట్ గురించి ఒక ప్రకటన చూశాను. వాట్సాప్ గ్రూప్ లో లింకు ఇచ్చారు. ఇద్దరు వ్యక్తులు నాతో చాట్ చేసి ఒక యాప్ ఇచ్చి అకౌంట్ నంబర్ ఇచ్చి పెట్టిన పెట్టుబడికి లాభాలు చూపిస్తూ ఆ డబ్బులు ఇవ్వాలంటే ఇన్ కమ్ ట్యాక్స్ శాఖ ధృవీకరించడానికి పంపాలని చెప్పి మొత్తంగా రూ. 5 లక్షలు సైబర్ మోసానికి గురి చేశారని కర్నూలుకు చెందిన సునీత ఫిర్యాదు చేశారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ హుస్సేన్ పీరా హామీ ఇచ్చారు.ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో సీఐలు శ్రీనివాస నాయక్, ఇబ్రహీం పాల్గొన్నారు.