సివిల్స్ ర్యాంకు సాధించిన శ్రీకాంత్ రెడ్డిని సన్మానించిన గుమ్మల్ల కుమార్ రెడ్డి
1 min read
చెన్నూరు , న్యూస్ నేడు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ (సివిల్స్) లో 151 సాధించిన చెన్నూరు గ్రామానికి చెందిన నేలటూరు శ్రీకాంత్ రెడ్డి చెన్నూరు కి సందర్భంగా ఆయనను వై ఎస్ ఆర్ సి పి కమలాపురం నియోజకవర్గం స్టూడెంట్స్ విభాగం అధ్యక్షులు గుమ్మల సాయికుమార్ రెడ్డి సోమవారం శ్రీకాంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుమ్మల సాయికుమార్ రెడ్డి మాట్లాడుతూ, నేలటూరు శ్రీకాంత్ రెడ్డి యూనియన్ పబ్లిక్ సర్వీస్ సివిల్స్ లో 151 ర్యాంకు సాధించి అటు తన కుటుంబానికి, ఇటు చెన్నూరు మండలానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడం జరిగిందన్నారు. ఆయన పట్టుదలతో చదివి ఉన్నత స్థానాన్ని అధిరోహించడం జరిగిందన్నారు. నేలటూరు శ్రీకాంత్ రెడ్డి సాధించిన ఈ ఘనత తో, మండల వ్యాప్తంగా ఆయన సన్నిహితులు, బంధువులు, స్నేహితులు అందరు కూడా సంబరాలు చేసుకోవడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఆయనను ఆదర్శంగా తీసుకొని గ్రామంలోని యువకులు మరింత ఉన్నత స్థానాలు సాధించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. శ్రీకాంత్ రెడ్డి ఎంత ఎత్తుకు ఎదిగిన తన గ్రామస్తులను, తన స్నేహితులను, తన బంధువులను ఎంతో ఆప్యాయత, నిష్కల్మస్యమైన మనసుతో పలకరించి వారందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం. ఆయన ఆదర్శమైన మనసుకు నిదర్శనమని ఆయన తెలియజేశారు. అనంతరం ఆయన తన స్నేహితులతో శ్రీకాంత్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల స్టూడెంట్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, సునీల్ కుమార్, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.