సంచార చికిత్స కార్యక్రమాన్ని జిల్లా నోడల్ ఆఫిసర్ తనిఖీ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: సోమవారం కోడుమూరు కో లోకేటెడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో జరుగుచున్న సంచార చికిత్స కార్యక్రమన్ని జిల్లా నోడల్ ఆఫిసర్ డాక్టర్ రఘు తనిఖీ చేశారు .అనంతరం ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుకుంటె అంటూ వ్యాధులు రాకుండ నివారించగల ఒక సులభమైన మార్గమని తెలిపారు.ముఖ్యంగా తినడానికి ముందు,మల,మూత్ర,విసర్జన చేసిన తరువాత,ముక్కు చీదిన తరువాత,ఏదేని తినుబండరాలను చేతిలో తీసుకొనేముందు మరియు తినే ముందు అనారోగ్యంగా ఉన్నవారికి సేవచేసే ముందు తరువాత,వంట వండే ముందు కూరగాయలు లేక ఏదేని వంట సంగ్రి తాకే ముందు, ,తుమ్మిన,దగ్గినా,ముక్కులను శుభ్రం చేసినా తరువాత, పిల్లల మలం శుభ్రం చేసిన తరువాత,పిల్లలు ఆటలాడిన తరువాత,ఎదిగిన పిల్లలైతే శానిటరీ ప్యాడ్స్ మార్చుకున్న తరువాత మరియు ప్యాడ్ పడవేసిన తరువాత,జంతువులు వాటి వ్యర్థాలు తాకిన తరువాత సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు,అనంతరం ప్రతిజ్ఞ చేయించినారు.ఈ కార్యక్రమంలో వైద్యులు శ్రీమంత్ మాదన్న ,ఆరోగ్య విస్తరణ అధికారి నరసప్ప , పర్యవేక్షకులు ఉమా బాయి,ఆరోగ్య కార్యకర్త సువర్ణ, మగ ఆరోగ్య కార్యకర్తలు జయకుమార్, కిరణ్ కుమార్ సింగ్,ఆశా కార్యకర్తలు మరియు ప్రాజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.