బనగానపల్లెలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తాం
1 min read
రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి
నంద్యాల, న్యూస్ నేడు: బనగానపల్లె పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలు ప్రతి ఒక్కరికి 2 సెంట్ల ఇళ్ల పట్టాలు ఇస్తామని గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నిరుపేదల ఇళ్ల పట్టాల అంశంపై జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డోన్ ఆర్డీవో నరసింహులు నంద్యాల ఆర్డీవో విశ్వనాధ్, బనగానపల్లె మండల తాసిల్దారు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రోడ్డు భవనాలు, మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ బనగానపల్లి పట్టణంలో దాదాపు 3500 నుంచి 4 వేల మంది నిరుపేదలకు 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని గతంలో హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి పేదలకు పట్టాలు ఇచ్చేందుకు వీలుగా ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అధికారుల పరిశీలనలో భాగంగా బనగానపల్లె పట్టణం భానుముక్కల గ్రామంలో పరిధిలో ప్రభుత్వ భూమిని గుర్తించాలని మంత్రి ఆదేశించారు అయితే 3500 నుంచి 4 వేల మందికి 2 సెంట్లు చొప్పున ప్రభుత్వ స్థలం ఇవ్వడానికి దాదాపు 116 నుంచి 140 ఎకరాల ప్రభుత్వ భూమి అవసరం అవుతోందని అధికారులు తెలిపారు.అలాగే బనగానపల్లెలో ఆటోనగర్ ఏర్పాటుకు సాధ్యసాద్యాలను పరిశీలించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బనగానపల్లెలో కార్పెంటర్లకు శాశ్వత నివాసాలు ఏర్పాటుకు కార్పెంటర్ కాలనీ ఏర్పాటుపై కూడ సాధ్యసాద్యాలను పరిశీలించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.