జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతులు
1 min read
డిప్యూటీ లైబ్రేరియన్ ఏ. నారాయణ
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణతరగతులు (సమ్మర్ ఓరియంటేషన్ తరగతులు)6 వరోజు ఎంతో ఆహ్లాధముగా,ఉత్సాహంగా జరుగుతున్నాయని డిప్యూటీ లైబ్రేరియన్ ఏ.నారాయణ రావు తెలిపారు. ఆదివారం ఆయన ఈ శిక్షణా తరగతులను పర్యవేక్షించారు. రిసోర్స్ పర్సన్ డి.శ్రీవల్లి విద్యార్ధులకు యోగాక్లాసులు, నీతికధలుచదివించడం జరిగింది.ప్రముఖ నృత్యకళాకారులు వై.ఫణి కాంత్ విద్యార్ధులకు అనేకరీతిల్లోనృత్యాలుపై శిక్షణఇవ్వడంజరిగింది.ఈ శిక్షణ కార్యక్రమములో గ్రంథాలయపునర్వికాస ఉధ్యమవేదిక జిల్లాకన్వినర్, హైస్కూల్ ఉపాధ్యాయులు,సీనియర్ కళాపోషకులు నాగాస్త్రగారు పాల్గోని శిక్షణతరగతులను ఉద్దేసించి విద్యార్ధులు ప్రతి ఒకరు గ్రంధాలయం సభ్యత్వంతీసుకోవాల న్నారు.అనంతరం పంచతంత్రంకధలు,అక్బర్ బీర్బల్ కధలు,మర్యాద రామన్న,నీతికధలను భోధిస్తు మీయొక్క సమయాన్నీ అస్సలు వృధాచేసుకోవద్దుఅని విలువైన సూచనలనుఇచ్చారు. మరియు “యుటీయఫ్ జిల్లా అధ్యక్షులు” ముస్తాఫాఆలీ, విద్యార్ధులకు మీపాఠ శాలల్లో అకాడమిక్ పుస్తకాలతో పాటుగా గ్రంథాలయానికి వచ్చి ఇక్కడ పుస్తకాలుకుడా చదవాలి.ఈ”సమ్మర్‌క్యాంప్” నందుఅనేకఅంశాల్లో ఉచితంగా రిసోర్స్ పర్సన్లు వచ్చి పేపరు క్రాఫ్ట్,ఆటలు,పాటలు,కధలు,కధనాలు, సృజనాత్మక నృత్యాలు,జనరల్ నాలెడ్జ్,గణితం,తరగతులు ఉచితంగా నేర్పిస్తున్నారు.ఇవన్నీ నెర్చుకుని మీ తోటివారికీకుడా తెలియజెయ్యాలి.మoచి విజ్ఞానవంతులుగా భవిష్యత్తులో ఉన్నతస్టాయికి ఎదగాలనికోరారు.ఈ కార్యక్రమములో అసిస్టెంట్ లైబ్రేరియన్ వీటీ.సందీప్ కమార్,ఎమ్.డి. అస్లాంపాషా, బివీఎస్.లక్ష్మి,విద్యార్ధులు పాల్గొన్నారు.