13న చలో డీపీటీవో కార్యాలయాల ముట్టడి..
1 min read
విజయవాడ, న్యూస్ నేడు: ఏపీఎస్ఆర్టీసీ : ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన దశలవారి ఆందోళన లో భాగంగా ఈనెల 13వ తేదీన చలో డీపీటీవో కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఏపీపీ టి డి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పివి రమణారెడ్డి, వై శ్రీనివాసరావు తెలిపారు. సమస్యల పరిష్కారం కోరుతూ గత నెల రెండవ తేదీ నుంచి దసలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని, అయినప్పటికీ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం స్పందించకపోవడంతో ఆందోళనను ఉదృతం చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే డిపిటిఓ కార్యాలయాలను ముట్టడించి అక్కడే ధర్నా చేయ తలపెట్టినట్లు వివరించాఏ పి పి టి డి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం విలేకరుల సమావేశాన్ని గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా తమ సమస్యల పరిష్కారం కోరుతూ దసరా వారీగా చేపట్టిన ఆందోళనను వివరించారు. 13వ తేదీన నిర్వహించనున్న చలో డిపి టిఓ కార్యాలయాల ముట్టడి వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టీవీ రమణారెడ్డి, వై శ్రీనివాసరావు మాట్లాడుతూ….తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో దీర్ఘకాలికంగా ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తున్నామన్నారు. ఇప్పటికే అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట వివిధ రైతులలో నల్ల బ్యాడ్జీలు ధరించి, ధర్నాలు చేసి నిరసన వ్యక్తం చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వ స్పందించని పక్షంలో ఆందోళనను ఉదృతం చేయక తప్పడం లేదని, ఆ క్రమంలోనే డిపి టిఓ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చినట్లు వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం , ఆర్టీసీ యాజమాన్యం స్పందించి డిమాండ్లు పరిష్కరించాలన్నారు. అక్రమ సస్పెన్షన్లు అక్రమ రిమూవల్స్ ఆపాలనీ, గత నాలుగు సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్స్ వెంటనే ఇవ్వాలన్నారు. గ్యారేజీ ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలనీ, మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవు మంజూరు చేయాలన్నారు. మొత్తంగా అన్ని సమస్యలను పరిష్కరించే దిశగా యాజమాన్యం స్పందించకపోతే తమ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.