PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హెల్మెట్లు వాడండి – ప్రమాదాలను నివారించండి -జడ్జి ఎంఎస్ భారతి  

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : మోటార్ బైక్ ల పైన ప్రయాణం చేసే వాహనదారులు   తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని పత్తికొండ జూనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి అన్నారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం పత్తికొండ మండల న్యాయ సేవాధికార  సంస్థ ఆధ్వర్యంలో న్యాయవాదులు, ప్రభుత్వ డిగ్రీకళాశాల విద్యార్థులు హెల్మెట్ల వాడకం పై   స్థానిక కోర్టు నుంచి పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి ఎమ్ఎస్. బారతి మాట్లాడుతూ…. రోడ్డు ప్రమాదాలలో తలకు గాయాలు కావడం వల్ల రక్త స్రావం అయ్యి ఎక్కువ మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్ వాడటం వల్ల ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు హెల్మెట్లు వాడాలని జడ్జి సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగస్వామి, ప్రధాన కార్యదర్శి మహేష్, ఏజీపీ నరసింహయ్య, న్యాయవాదులు ఎల్లారెడ్డి, వెంకట్రాముడు,  రమేష్ బాబు, కృష్ణయ్య, ప్రసాద్ బాబు, మధుబాబు, దామోదర్ ఆచారి, అశోక్ కుమార్,అరుణ్, రవి కుమార్, వీరేశ్,సూరజ్ నబి , హరి, నెట్టేకల్లు, చంద్రశేఖర్, రాజవర్ధనరెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్లు, లోక్ అదాలత్ సిబ్బంది రవణమ్మ, ప్రసాద్ , ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాధురి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author