కూటమి సర్కార్ కాపులపై వివక్ష చూపుతుంది!
1 min read
కూటమి ప్రభుత్వ పాలనలో పారదర్శకతలేదు!
కాపు ఐక్యవేదిక చైర్మన్ రావి శ్రీనివాస్
విజయవాడ, న్యూస్ నేడు: కూటమి సర్కార్ కాపులపై వివక్ష చూపుతుందని, కూటమి ప్రభుత్వ పాలనలో పారదర్శకతలేదని కాపు ఐక్యవేదిక చైర్మన్ రావి శ్రీనివాస్ అన్నారు. కాపు ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం, గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపు, బలిజ, ఒంటరి కులాలపై కూటమి సర్కార్ వివక్షతతో వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. కాపుల పట్ల ఈ విధమైన కులవివక్షపాలన సుపరిపాలన అనిపించుకోదని, ఉదాహరణలతో ఆధారాలతో శాస్త్రీయంగా గౌరవ మంత్రివర్గ ఉపసంఘం ముందు నిరూపిస్తామని స్పష్టం చేశారు.తాము నిరూపించలేని పక్షంలో కూటమి ప్రభుత్వానికి బహిరంగ క్షమాపణలు చెప్పి తమ డిమాండ్లను ఉపసంహరించుకొని వైదొలుకుతామన్నారు. కాపు ఐక్యవేదిక మంత్రిమండలికి సమర్పించిన బహిరంగ లేకపై కమిటీ వేసి నిజాలు నిరూపించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పారదర్శకత లేని ద్వంద్వ విధానాలతో, ద్వంద్వ నీతితో సామాజిక అన్యాయాన్ని చట్టబద్ధం చేసే చర్యలను కాపు ఐక్య వేదిక నిరసిస్తుందన్నారు. తమ యొక్క నిరసనపై మంత్రి మండలి స్పందించి సమావేశంలో చర్చించాలని డిమాండ్ చేశారు.