ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు
1 min read
ర్యాలీలో పాల్గొన్న ఆర్యవైశ్యులు
హొళగుంద న్యూస్ నేడు : మండల కేంద్రంలో వాసవి మాత జయంతి ఉత్సవాలను మండలంలోని పలు గ్రామాలలో ఉన్న ఆర్యవైశ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని పెద్ద భావి నుంచి ఊరేగింపుగా వెళ్లి వాసవిదేవి జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక అలంకరణ గావించి ప్రత్యేక పూలతో విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలలో భాగంగా లలితాసహస్రనామావళి పఠించి, కన్యకాపరమేశ్వరి జీవిత చరిత్ర పారాయణం చేశారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ఆర్యవైశ్యులు వాసవీ కన్యకా పరమేశ్వరి చిత్రపటాన్ని మరియు విగ్రహాన్ని ప్రత్యేక అలంకరణ వాహనంలో ఉంచి గ్రామపుర వీధులకుండా భజనలతో, ఆటపాటలతో ఊరేగింపుగావించారు. అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో అన్నదానప్రసాదాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆలయ ఆవరణలో రధోత్సవం నిర్వహించారు. జయంతి పూజలు వైభవంగా నిర్వహించి, పురవీధుల్లో శోభయాత్ర చేపడుతూ శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి ప్రత్యేకతను భక్తులకు చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్థానిక ఆర్యవైశ్య సంఘం నాయకులు సింగంశెట్టి కృష్ణమూర్తి, శివప్ప గోపాల్, సత్యం, పద్మనాభశెట్టి, జిటి ప్రకాష్ శెట్టి, ప్రసాద్ శెట్టి, సింగం సూదర్శన్ శెట్టి.నవీన్ కుమార్ శెట్టి, శ్రీమంత్ శెట్టి, శ్రీధర్శెట్టి, మరియు పలు గ్రామాల నుండి వచ్చిన ఆర్యవైశ్య నాయకులు కార్యకర్తలు, తదితరులు చిన్నారులు మహిళలు పాల్గొన్నారు.
