NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కుట్టుమిషన్ శిక్షణ ముసుగులో బిసి మహిళల పేరుతో భారీ దోపిడీ

1 min read

తొలి విడతలో రూ.157 కోట్లు స్వాహాకు యత్నం

ఎమ్మిగనూరు, న్యూస్​ నేడు:  కూటమి టీడీపీ నేతలు మొత్తంగా రూ.254 కోట్ల దోపిడీకి కుట్ర   వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బిసి సెల్  సంయుక్త కార్యదర్శి  వీరుపాక్షి రెడ్డి ,నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు టి.మురళి నాయుడు ,జిల్లా చేనేత అధ్యక్షులు యం.కె శివ ప్రసాద్  మండిపడ్డారు.ఎమ్మిగనూరు పల్లెవెలుగు న్యూస్ ఎమ్మిగనూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక  అదేశాల మేరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బిసి సెల్ సంయుక్త కార్యదర్శి వీరుపాక్షి రెడ్డి ,నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు టి.మురళి నాయుడు ,జిల్లా చేనేత అధ్యక్షులు యం.కె శివ ప్రసాద్   మహిళలకు వృత్తి నైపుణ్యాలను అందించే కార్యక్రమాలను కూడా అవినీతి కల్పతరువులుగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని మండిపడ్డారు. బీసీ. ఓబీసీ, కాపుమహిళలకు కుట్టుశిక్షణ, మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఏకంగా తొలి విడతలో రూ.157 కోట్లు దోచుకునేందుకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ శిక్షణ సంస్థలను కాదని, కూటమి నేతలు తమకు అనుకూలమైన వ్యక్తులకు నిబంధనలకు విరు ద్దంగా టెండర్లను కట్టబెట్టారని ఆరోపించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు పట్టణంలోని కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దోచుకో… తినుకో.. పంచుకోఅనే లక్ష్యంతో పనిచేస్తోంది. రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది మహిళలు ఉన్నారు. వారికి ఎన్నికల హమీల్లో ఇచ్చిన వాటిని ఏ ఒక్కటీ నేటికీ అమలు చేయడం లేదు. ఈ రోజు తల్లికివందనం, మహాశక్తి, ఉచిత బస్సు, కళ్యాణ మస్తు, పండుగ కానుకలు వంటి స్కీంలు ఎక్కడా అమలు చేయడం లేదు. ఇప్పుడు మహిళలకు కుట్టు మిషన్లు, శిక్షణ కోసం నిర్దేశించిన స్కీంలోనూ అవినీతికి పాల్పడ్డారు. మొదటి విడతలో రూ.157 కోట్లు దోపిడీకి ప్లాన్ చేశారు. మొత్తంగా రూ.254 కోట్లను యాభై రోజుల్లో దోచుకునేందుకు సి ద్ధమయ్యారు. కుట్టుమిషన్ ట్రైనింగ్ అంటూ కుంభకోణంకు పాల్పడ్డారు. మహిళలకు ఇచ్చే కుట్టుమిషన్లు, దాని శిక్షణ కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున దోచుకునేందుకు సిద్ధప డ్డారు. ఒక మహిళ మంత్రిగా ప్రాతినిధ్యం వహి స్తున్న శాఖలో ఈ అవినీతి జరగడం దారుణం. మొదట్లో లక్ష మంది మహిళలకు శిక్షణ ఇస్తామ ని చెప్పారు. యాబై రోజుల్లో ఏకంగా రూ.157 కోట్ల స్కామ్క తెర లేపారు. రెండు రోజులుగా రాష్ట్రం లోని మహిళలు గగ్గోలు పెడుతున్నారు. బీసీ, ఈబీసీ, కాపు మహిళలు లక్ష మందికికుట్టు శిక్షణ ఇవ్వాలని ప్రారంభించిన ఈ పథకాన్ని అవినీతికి అడ్డాగా మార్చేశారు. కుట్టుమిషన్, శిక్ష ణకు కలిపి సుమారుగా ఒక్కో మహిళకు వెచ్చించే వ్యయం సుమారు రూ.7,300 అవుతుంది. కానీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.23వేల అవుతుందని అంచనా వేసింది. దీనిలో ఒక్కొక్కరి పేరుమీద దాదాపు రూ.15,700 లు అవినీతికి పాల్పడుతున్నారు. టెండర్ నిబంధనల ప్రకారం శిక్షణ ప్రారంభమైన పదిహేను రోజులకు 33 శాతం. ముప్పై రోజుల తరువాత మరో 33 శాతం, యాబై రోజుల తరువాత మిగిలిన 34 శాతం విడుదల చేయాలి. కానీ ఈ కాంట్రాక్ట ర్కు మొబిలైజేషన్ అడ్వాన్లస్ల కిందనే ఏకంగా రూ.25 కోట్లు విడుదల చేసేందుకు సిద్దమయ్యా రు. ప్రభుత్వ సంస్థలు, సీడాప్, ఏపీఐటీసీఓ, డీడీయుజీకేవై వంటి సంస్థలు ఉన్నాయి. వాటిని వదిలేసి టెండర్లు పిలిచారు. ఎల్ 1కు ప్రాధా న్యత ఇవ్వకుండా ఎల్ 2, ఎల్ 3 లకు 93 శాతం పనులను కట్టబెట్టారు. వారు కూడా టీడీపీ ప్రజా ప్రతినిధులు, వారి బినామీలే. ఈ కుంభకోణంపై కేంద్ర ధర్యాప్త్తు సంస్థలతో విచారణ జరిపించాలి. ఎన్నికలకు ముందు బాబు ష్యూరిటీ… భవిష్యత్ గ్యారెటీ అన్నారు. ఈ రోజు బాబు ష్యూరిటీ.. అవినీతి గ్యారెంటీ అనే విధంగా పాలన సాగుతోంది. తెలుగుదేశం కాస్తా తెలుగు దోపిడీగా మారింది.ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ డి.నజీర్ అహమ్మద్ , రాష్ట్ర చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి మాచాని వెంకటేష్ ,జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి యు.కె రాజశేఖర్ గ,నందవరం మండల అధ్యక్షులు శివారెడ్డి గౌడ్  ,పట్టణ కార్యదర్శి జెరుబండి రఘువీరా ,33 వ వార్డు నాయకులు వడ్డే వీరేష్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *