జిల్లా యంత్రాంగం సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహణ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహణ కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర, ఓర్వకల్లు మండలం, పూడిచెర్ల గ్రామంలో చేపట్టారు. బుధవారం సాయంకాలం జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా సూచనల మేరకు 4 గంటలకు కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర, ఓర్వకల్లు మండలం ,పూడిచెర్ల గ్రామంలో అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ను అధికారులు నిర్వహించారు.మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫ్ఫైర్స్ ద్వారా జారీ చేసిన ఎస్ ఓ పీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) ప్రకారం మాక్ డ్రిల్ నిర్వహించారు. మాక్ డ్రిల్ చేసే ముందు ప్రజలు భయాందోళనలకు గురి కాకుండా ముందుగా వారికి సమాచారం అందించారు. కొండారెడ్డి బురుజు, ఓర్వకల్లు మండలం ,పూడిచెర్ల గ్రామంలో ఆయా పరిసరాలు అనౌన్స్మెంట్ ద్వారా ప్రజలకు వివరించి సైరన్ మోగిన వెంటనే ప్రజలు సురక్షిత ప్రదేశంలోకి వెళ్లే విధంగా సూచనలు ఇచ్చి చైతన్య పరిచారు.ఈ పరిస్థితులలో చేపట్టవలసిన చర్యలను డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ అనుపమ ,అర్బన్ తహసిల్దార్ వెంకటలక్ష్మి పాల్గొని పలు సూచనలు చేశారు.కర్నూలు పట్టణ 1&2 సిఐ లు రామయ్య నాయుడు , రాజారావు , ట్రాఫిక్ సిఐ మన్సరుద్దీన్ లు ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు మరియు బందోబస్తు చర్యలు చేపట్టారు.ఈ మాక్ డ్రిల్ నందు కర్నూలు మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు , ఆర్డిఓ సందీప్ కుమార్ , ఎంఆర్ఓ విద్యాసాగర్, ఇంచార్జ్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ బాలరాజు (నంద్యాల ), డి పి ఎం అనుపమ, ఏపీ ఎస్ డి ఆర్ ఫ్ డీఎస్పీ సుధాకర్ రెడ్డి వారి సిబ్బంది, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి, కర్నూలు అర్బన్ తాసిల్దార్ వెంకటలక్ష్మి , కర్నూలు పట్టణ 1&2 సిఐ లు రామానాయుడు , రాజారావు , ట్రాఫిక్ సిఐ మన్సరుద్దీన్, కర్నూల్ తాలూకా సిఐ శ్రీధర్, ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి, ఓర్వకల్ ఎస్సై సునీల్, ఉలిందకొండ ఎస్సై ధనుంజయ , ఎన్సిసి క్యాడేట్లు, ఆరోగ్యశాఖ సిబ్బంది , సచివాలయల సిబ్బంది పాల్గొన్నారు.