ఆంధ్రప్రదేశ్ లో డబల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది!
1 min read
కార్మికుల అభ్యున్నతి, సమానత్వమే లక్ష్యం!
భారతీయ జనతా మజ్దూర్ సెల్
విజయవాడ, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ లో డబల్ ఇంజన్ సర్కార్ నడుస్తుందని కార్మికుల అభ్యున్నతి, సమానత్వమే లక్ష్యంగా భారతీయ జనతా మజ్దూర్ సెల్ (బిజెయంసి) కృషి చేస్తుందని కమిటీ జాతీయ చైర్మన్ బిత్వ రాయ్ చౌదరి అన్నారు.గురువారం, గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట్రశాఖ ఆధ్వర్యంలోఆత్మీయ సమావేశం జరిగింది. కార్యక్రమంలో పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూకార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు భారతీయ జనతా మజ్దూర్ సెల్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. కార్మికుల అభ్యున్నతే ధ్యేయం, కార్మికుల సమానత్వమే లక్ష్యంఅన్నారు.పారిశ్రామిక విధానం ఉత్పత్తి సేవా రంగాలను బలోపేతం చేస్తూ అందులో కార్మికులను భాగస్వామ్యం చేయటమే బిజెయంసి ఆలోచన అన్నారు. గిగ్ వర్కర్స్ పెద్ద భవనంతో పాటు భారీ యంత్రాలలో పనిచేసే కార్మికులు దిగ్గు, ప్లాట్ఫార్మ్ వర్కర్స్ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని, అసంఘటిత రంగ దిగ్ వర్కర్లకు 5 లక్షల ప్రమాద బీమా సంక్షేమం అమలు చేయాలన్నారు. బిజెయంసి రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫాతుల్లా భాష మాట్లాడుతూఆంధ్రప్రదేశ్ నుంచి గల్ఫ్ దేశాలలో పనిచేసే కార్మికుల కోసం ప్రభాస్ ఆంధ్ర సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని, ఆంధ్రప్రదేశ్ నుండి ఇతర దేశాలకు వెళ్లి మరణించిన మన కార్మికులకు ఐదు లక్షల ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందించాలని కోరారు.భవన నిర్మాణ కార్మికులకు పండగలకు ఐదువేల రూపాయలు ఆ యజమానులు ఇచ్చే విధంగా కృషి చేయాలన్నారు.ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో అసంఘటిత కార్మికులు స్ట్రీట్ వండర్స్ అంటే రోజువారి కూలి వేతనం తీసుకునే వారికి ఈఎస్ఐ, పిఎఫ్ అదేవిధంగా ఎటువంటి రిజిస్ట్రేషన్ ఉండవు కాబట్టి వీరందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భద్రత కల్పించే విధంగా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ శ్రమ్ కార్డ్ ప్రతి ఒక్కరికి అందే విధంగా తగు చర్యలు తీసుకొని అందరికీ న్యాయం చేయవలసినదిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దానితోపాటు పిఎఫ్ ఈఎస్ఐ రిజిస్ట్రేషన్ తో ఇవ్వాలని, ప్రతి జిల్లాలో కార్మిక శాఖ సిబ్బందికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రతి ఫలాలు ప్రతి ఒక్క కార్మికులకు అందే విధంగా కృషి చేయవలసిందిగా భారతీయ జనతా మజ్దూర్ సెల్ డిమాండ్ చేసింది. కార్యక్రమంలో విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్ క్లీనింగ్ విభాగంలో పనిచేస్తున్న మహిళా కార్మికులను సత్కరించడంతోపాటు వారికి చీరలను పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో బిజెయంసి నాయకులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
