గవర్నర్ అవార్డు, గోల్డ్ మెడల్ ను పొందిన నంద్యాల జిల్లా కలెక్టర్
1 min read
నంద్యాల, న్యూస్ నేడు: రెడ్ క్రాస్ అభివృద్ధికి విశేష సేవలు అందించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా గవర్నర్ అవార్డును పొందారు. గురువారం అమరావతిలోని రాజ్ భవన్ లో జరిగిన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మరియు ప్రపంచ తలసేమియా దినోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎస్. అబ్దుల్ నజీర్ మరియు ప్రథమ మహిళ శ్రీమతి సమీరా నజీర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గవర్నర్ అవార్డు, గోల్డ్ మెడల్ ను స్వీకరించారు.రాష్ట్రంలో రెడ్ క్రాస్ ఉద్యమానికి అత్యుత్తమ సేవలు అందించడంతోపాటు మరియు గరిష్ట సహకారాన్ని సమీకరించినందుకు 8 మంది కలెక్టర్లకు గవర్నర్ పతకాలను అందజేశారు.ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలో రెడ్ క్రాస్ అభివృద్ధికి విశేష సేవలు అందించిన నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి కి ప్రతిష్టాత్మకమైన అవార్డును మరియు గోల్డ్ మెడల్ ను గవర్నర్ చేతులు మీదుగా అందుకోవడం జరిగిందిఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ఇటీవల అధునాతన వసతులతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ను ప్రారంభించుకున్నామన్నారు. అలాగే రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రజలకు అత్యంత తక్కువ ధరలకు లభ్యమయ్యేలా జనరిక్ మెడికల్ షాప్ ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యూత్ బ్లడ్ క్రాస్ ను బలోపేతం చేసి అత్యవసర పరిస్థితుల్లో సేవలందించేలా రెడ్ క్రాస్ ఆర్మీనీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తయారు చేస్తామన్నారు. మత్స్యకారులకు, చెంచు కుటుంబాలకు కూడా రెడ్ క్రాస్ సంస్థ ద్వారా మరిన్ని వైద్య సేవలు ఇంటింటికి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ వై డి రామారావు, కోశాధికారి రామచంద్ర రాజు, జనరల్ సెక్రెటరీ ఏకే ఫరీదా ఐఏఎస్ , నంద్యాల చైర్మన్ దస్తగిరి పర్ల తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ లో రెడ్ క్రాస్ తలసేమియా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్ ను గవర్నర్ రాజ్ భవన్ నుండి వర్చువల్ మోడ్ లో ప్రారంభించారు.