అత్యుత్తమ సేవలకు పురస్కారం…
1 min read
రాష్ట గవర్నర్ నుండి రెడ్ క్రాస్ అవార్డ్ అందుకున్న జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు: రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా రాష్ట్ర గవర్నర్ నుండి జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కు పురస్కారం లభించింది.2023 -24, 2024-25 సంవత్సరాల్లో బాపట్ల, కర్నూలు జిల్లాల్లో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అత్యుత్తమ సేవలందించిన సందర్భంగా గురువారం విజయవాడ రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గౌ. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ స్టేట్ బ్రాంచ్ ప్రెసిడెంట్ శ్రీ అబ్దుల్ నజీర్ నుండి జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా రెడ్ క్రాస్ అవార్డ్ అందుకున్నారు.రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా గడచిన రెండేళ్లలో కర్నూలు, బాపట్ల జిల్లా లలో చేపట్టిన సేవలను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రశంసించారు. కర్నూలు, బాపట్ల జిల్లాల్లో రెడ్ క్రాస్ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంపులు, ఆర్గాన్ డొనేషన్స్, మెడికల్ క్యాంపులు పల్స్ పోలియో, లెప్రసీ, ఎయిడ్స్ అవేర్నెస్ ర్యాలీలు, తదితర కార్యక్రమాలు నిర్వహించడాన్ని గవర్నర్ ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ను అభినందించారు.