గురుకుల ఎంట్రెన్స్ పరీక్షలో హొశగుంద విద్యార్థి ప్రతిభ
1 min read
న్యూస్ నేడు హొళగుంద : డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల ఎంట్రెన్స్ పరీక్షలోహొళగుందకు చెందిన ఎన్.ఎస్. సందేశ్ అనే విద్యార్థి బీసీ డీ కెటగిరిలో స్టేట్ ర్యాంక్ ఫస్ట్, జనరల్ కెటగిరిలో స్టేట్ 5వ ర్యాంకు సాధించి ప్రతిభచాటినట్లు హొళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం నజీర్ అహమ్మద్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. సదరు విద్యార్థి స్తానిక పాఠశాలలో 10వ తరగతి చదువుతూ ఇటివల జరిగిన పబ్లిక్ పరీక్షలో 584/600 మార్కులు సాధించిన సంగతి తెలిసిందే. గురుకుల పాఠశాలలో ప్రవేశం పొందెందుకు గాను ఎంట్రెన్స్ పరీక్ష వ్రాయగ ఈ మేర ర్యాంకు సాధించినట్లు హెచ్ఎం వెల్లడించారు. కాగా ఎంట్రెన్స్ మంచి ప్రతిభకనబరిచిన సందేశ్ను హెచ్ఎం నజీర్ అహమ్మద్, ఉపాధ్యాయులు, స్నేహితులు అభినందించారు.