ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి
1 min read
మే 12వ తేది నుండి మే 20వ తేది వరకు సప్లిమెంటరీ పరీక్షలు
మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు వ్రాయనున్న 10,779 మంది విద్యార్థులు
ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కానున్న 3325 మంది విద్యార్థులు
42 పరీక్షా కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ
జిల్లా రెవెన్యూ అధికారి డి.రాము నాయక్
నంద్యాల, న్యూస నేడు: ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి డి.రాము నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని డిఆర్ఓ ఛాంబర్ లో ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై డిఆర్ఓ సమావేశం నిర్వహించారు. సమావేశంలో డిఐఓ సునీత, డిఈసి మెంబెర్స్ రామన్, కృష్ణయ్య, ప్రభాకర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి డి.రాము నాయక్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 12వ తేది నుంచి 20వ తేది వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉ.9.గం.ల నుండి మ.12.గం.ల వరకు మొదటి సంవత్సర పరీక్షలు, మ.2:30.గం.ల నుండి సా.5:30 గం.లకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మొదటి సంవత్సరంకు సంబంధించి జనరల్ విభాగంలో 10,192 మంది, వొకేషనల్ 587 మొత్తంగా 10,779 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జనరల్ విభాగంలో 2,959 మంది, వొకేషనల్ 366 మొత్తంగా 3325 విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం జరుగుతుందన్నారు. సప్లిమెంటరీ పరీక్షలను 42 పరీక్షా కేంద్రాల్లో (ప్రభుత్వ జూనియర్ కళాశాల-19, ఏపి మోడల్ స్కూల్స్-2, ప్రైవేటు అన్ఎయిడెడ్ జూనియర్ కళాశాలు-19) నిర్వహించడం జరుగుతుందన్నారు. అందుకు వైద్యశాఖ అధికారులు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఆశా, ఎఎన్ఎంలతో మెడికల్ కిట్స్ ఏర్పాటు చేయాలని వైద్య సిబ్బందిని డిఆర్ఓ ఆదేశించారు. పరీక్షా సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను డిఆర్ఓ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్స్ మూసి ఉంచేలా చూడాలన్నారు. అదే విధంగా పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను డిఆర్ఓ ఆదేశించారు. సున్నిత/సమస్యాత్మక పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా పూర్తి అయిన తర్వాత పరీక్షా పత్రాలను ఎప్పటికపుడు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు.