తెలంగాణ ఎంసెట్లో 18వ ర్యాంకు సాధించిన ఏపీ విద్యార్థి
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: తెలంగాణ ఎంసెట్లో ఏపీ విద్యార్థి అద్భుతమైన ప్రతిభను చాటాడు. ఏపీ, కర్నూలు జిల్లా, పత్తికొండకు చెందిన కప్పట్రాళ్ల చెన్నకేశవ అనే విద్యార్థి తెలంగాణ ఎంసెట్లో ఏకంగా 18వ ర్యాంకు సాధించి ఔరా అనిపించుకున్నాడు. ఇటీవల జరిగిన జేఈఈ మెయిన్స్ లోను, ఇంటర్లోను ఈ విద్యార్థి అద్భుతమైన ఫలితాలను సాధించాడు. జేఈఈ మెయిన్స్ లో జాతీయస్థాయిలో 206 ర్యాంకు సాధించాడు. అలాగే ఇంటర్లో 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించాడు. ఈ విద్యార్థి విద్యలో అత్యున్నత ప్రతిభను కనబరుస్తూ, అద్భుతమైన ఫలితాలను సాధించడం పట్ల స్థానికుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.విద్యార్థి తల్లిదండ్రులు కళ్యాణి కుమారి ఉపాధ్యాయిని కాగా, తండ్రి రమేష్ హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు.